హైదరాబాద్

ఖాళీ చేయకుంటే.. నచ్చజెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇళ్లను ఖాళీ చేసి అప్పగించని వారికి.. ఇళ్లతో చేకూర్చే ప్రయోజనాన్ని నచ్చజెప్పి ఖాళీ చేయించాలని అధికారులను రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆదేశించారు. భోజగుట్టలో నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కొంత వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న మంత్రి ఇప్పటి వరకు లబ్ధిదారులు, అధికారులతో పలు దఫాలుగా చర్చలు, సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. గురువారం మరోసారి మంత్రి తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పేద ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పేదల సొంతింటి కలను నిజం చేసేందుకే ప్రభుత్వం ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టిందన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. భోజగుట్టలో రూ.141 కోట్ల వ్యయంతో 1824 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇందులో 320 ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వివరించారు. మరో 1504 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, ఇక్కడే నివసిస్తున్న 230 కుటుంబాలు తాము నివసిస్తున్న ఇళ్లను ఖాళీ చేయకపోవటంతో పనులను ప్రారంభించలేకపోతున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, కార్పొరేటర్ బంగారి ప్రకాశ్, జాయింట్ కలెక్టర్ రవి, జోనల్ కమిషనర్ ముషారఫ్, ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఈ కిషన్, ఈఈ వెంకట దాసురెడ్డి పాల్గొన్నారు.