హైదరాబాద్

బడ్జెట్‌కు ‘స్థారుూ’ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థ రానున్న ఆర్థిక సంవత్సరానికి (2020-2021) రూ.5380 కోట్లతో రూపొందించిన బడ్జెట్ ముసాయిదాకు ఎట్టకేలకు స్థారుూ సంఘం ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు భారీ ప్రాజెక్టులకు రూ.1593 కోట్లతో ప్రత్యేకంగా రూపొందించిన బడ్జెట్ ముసాయిదాకు కూడా స్థారుూ సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదివరకు జరిగిన సమావేశంలోనూ రెండు బడ్జెట్‌లపై చర్చించిన స్థారుూ సంఘం గురువారం జరిగిన సమావేశంలో మరింత లోతుగా చర్చించిన అనంతరం బడ్జెట్ ముసాయిదాకు అంగీకారం తెలిపినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. త్వరలోనే కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి, కార్పొరేటర్లందరితో చర్చించి, ఆమోదించిన తర్వాతే ఆమోదం కోసం సర్కారుకు పంపనున్నారు.
బడ్జెట్ సర్వసభ్య సమావేశాన్ని ఫిబ్రవరి 20వ తేదీలోపు నిర్వహించి, ఆమోదం తెలిపి ప్రభుత్వానికి మార్చి 7వ తేదీలోపు పంపాలని కూడా స్థారుూ సంఘం నిర్ణయించింది.
మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ లోకేశ్ కుమార్‌తో పాటు స్థారుూ సంఘం సభ్యులు చెరుకు సంగీత, సమీనా బేగం, మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ ముస్త్ఫా అలీ, మిస్ బావుద్దిన్, ఎం.మమత, ఎక్కాల చైతన్య కన్న, మహ్మద్ అఖిల్ అహ్మద్, తొంట అంజయ్య, సబీనా బేగం, సామల హేమ హాజరయ్యారు.
స్థారుూ సంఘం బడ్జెట్‌తో పాటు రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌దారులకు ఇటీవల పెంచిన కరవు భత్యాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులకు కూడా పెంచుతున్నట్లు తీర్మానం చేసింది.
* గ్రేటర్ హైదరాబాద్‌లోని 149 మంది కార్పొరేటర్లు, ఐదుగురు కోఆప్షన్ సభ్యులలో ఆరుగురు కుటుంబ సభ్యులకు రూ.5లక్షల మేర వైద్య బీమాను వర్తింపజేయటానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.82.95లక్షలను ప్రీమియంగా చెల్లించేందుకు అనుకూలంగా నిర్ణయం చేశారు.
* నగరంలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఎర్నెస్టు అండ్ యంగ్ గ్లోబల్ లిమిటెడ్ సర్వీసు సంస్థను కన్సల్టెంట్‌గా నియమించాలని తీర్మానం.