హైదరాబాద్

జన్యూ సంబంధ వ్యాధులపై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: జన్యూ సంబంద వ్యాధులపై ప్రజలల్లో విస్తృత అవగాహన కల్పించాల్సి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ జనటిక్స్, నిజాం ఇన్సిటిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో జనటిక్ న్యూరోమస్క్యులర్ డిజార్డర్స్ అనే అంశంపై మూడు రోజుల పాటు జరగనున్న సదస్సును నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌తో కలిసి ప్రారంభించారు. జన్యూ సంబంద వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన పెంపొందించాల్సి ఉందని అన్నారు. మేనరిక సంబంధాలు, చిన్న వయస్సులో వివాహాలు జరపడంతో జన్యు లోపాలు తలెత్తుతున్నాయని అన్నారు. వీటిని నిరోదించేందుకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. వైద్యులు మానవతాదృక్పదంతో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులను కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం దేశంలోనే 17వ స్థానంలో ఉన్న నిమ్స్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది సింగిల్ డిజిట్ ర్యాంక్‌కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా, నిమ్స్ డీన్ రామ్మూర్తి, ఏకే మీనా, గిరీషం, ఆశ్విన్ దలాల్, ప్రజ్ఞ రంగనాథ్ పాల్గొన్నారు.