హైదరాబాద్

స్వచ్ఛ సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: నిజాం హయాంలో నగర ప్రజలకు తాగునీటిని అందించిన హుస్సేన్‌సాగర్‌కు పూర్వ వైభవాన్ని సంతరింపజేస్తామని, ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రారంభించిన పనులను ఆయన బుధవారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం ఒకప్పుడు లేక్స్ సిటీగా పేరుగాంచిందని, అందులో ముఖ్యంగా జంటనగరాలకు హుస్సేన్‌సాగర్ తలమానికంగా ఉండేదని వివరించారు. కాలక్రమేనా ఈ చెరువు కలుషితమైపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్సేన్‌సాగర్‌ను మళ్లీ శుద్ధి చేయాలని, తాగునీరు నింపుకునేందుకు వీలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే సాగర్‌లో పలు నాలాల ద్వారా మురుగునీరు చేరుతున్నట్లు గుర్తించి, జలమండలి ఆధ్వర్యంలో మురుగునీటిని మళ్లించే పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టామన్నారు. నాలుగు ప్యాకేజీలుగా చేపట్టిన పనుల్లో భాగంగా సుమారు 2.8 కిలోమీటర్ల పొడువున ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న పైప్‌లైన్ నిర్మాణ పనులు ఇప్పటి వరకు రెండు కిలోమీటర్ల వరకు పూర్తయిందని, మిగిలిన 0.8 పొడువు పైప్‌లైన్ పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని వివరించారు. భవిష్యత్తులో మళ్లీ ఎపుడూ కూడా మురుగునీరు చెరువులో చేరకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే వేసవి కల్లా సాగర్‌ను మంచినీటితో నింపే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశామని మంత్రి కెటిఆర్ వివరించారు. పనులు రికార్డు సమయంలో పూర్తయవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. గండిపేట చెరువు అభివృద్ధి కోసం కూడా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ సాగర్ ప్రక్షాళన పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఇందుకు గాను ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా ఎప్పటికపుడు పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పనులను పరిశీలించిన మంత్రులతో పాటు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్ ఎం.కొండారెడ్డి, అధికారులు జి.రామేశ్వర్‌రావు, ఎల్లస్వామి ఉన్నారు.

స్కూల్ బస్ కిందపడి పసిపాప మృతి
వనస్థలిపురం, డిసెంబర్ 16: స్కూల్ బస్ కింద పడి 14 నెలల పసిపాప మృతిచెందిన సంఘటన పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు- శాతవాహననగర్‌లో వుండే బాల్‌రాజ్, జనని దంపతులకు నమ్రత (3), మహాలక్ష్మి (14నెలలు) కుమార్తెలు. పెద్దపాప నమ్రత బాలకార్తికేయ పాఠశాలలో నర్సరీ చదువుతుంది. బుధవారం సాయంత్రం నమ్రతను దించడానికి స్కూలు బస్ రాగా తల్లి నమ్రతను దింపుతుండగా, చిన్నపాప మహాలక్ష్మి ఆడుకుంటూ వచ్చి స్కూలు బస్ కిందికి వెళ్లిపోయింది. నమ్రత దిగిన అనంతరం డ్రైవర్ బస్‌ను నడిపించగా అప్పటికే మహాలక్ష్మి తలపైకి టైర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందింది.

ఉత్తమ పాఠశాలలకు జనవరి 26న అవార్డులు
జిల్లా విద్యాధికారి రమేష్ వెల్లడి
వికారాబాద్, డిసెంబర్ 16: జిల్లాలోని మంచిగా పనిచేసే ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి జనవరి 26న అవార్డులు ఇవ్వనున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాధికారి జి.రమేష్ వెల్లడించారు. బుధవారం పట్టణంలోని జిల్లా విద్యాశిక్షణ సంస్థ ఆవరణలోని గాంధీ సమావేశపు హాలులో భౌతికశాస్త్రంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు ఏడుగురు చొప్పున పదోతరగతి విద్యార్థులను ఉత్తమ ఫలితాల కోసం దత్తత తీసుకోవాలని సూచించారు. విద్యార్థి పాఠశాలకు రాకపోయినా, సమస్యలున్నా విద్యార్థిని ఆప్యాయంగా పలకరించి మాట్లాడాలని, మానసికంగా చదువుకునేందుకు ప్రోత్సహించాలని సూచించారు. మూడు నెలలపాటు శ్రద్ధగా చదివితే పదోతరగతిలో మంచి ఫలితాలు సాధించవచ్చనే విషయాన్ని విద్యార్థికి నచ్చజెప్పాలని పేర్కొన్నారు. విద్యార్థులు సాధించే ఫలితాలు ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రుల సమష్టి బాధ్యత అని తెలిపారు. సమావేశాలు ఏర్పాటు చేసినపుడు విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశాలకు రావాలని, తల్లిదండ్రులు కోరిన సమయంలోనే సమావేశాలు ఏర్పాటు చేస్తారని వివరించారు. ప్రతి నెల ఒకటో తేదీన సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థుల కోసం పాఠశాలలో సలహాల పెట్టె ఏర్పాటు చేయాలని, పేరు రాయకుండా విద్యార్థులు కాగితంపై సలహాలు రాయవచ్చని, పాఠశాల ఉపాధ్యాయులు సలహాపై చర్చించుకోవాలని అన్నారు. ప్రతి సబ్జెక్టులో యూనిట్‌కో 20 నుండి 30 ప్రశ్నలు తయారు చేసి ఆదివారం స్లిప్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించామని తెలిపారు. డిసెంబర్ 31లోపు సిలబస్ పూర్తి చేయాలని, సంక్రాంతి సెలవులు ముగిసిన అనంతరం జనవరి 18 నుండి రివిజన్ ప్రారంభించాల్సి ఉంటుందని వివరించారు. విద్యార్థుల్లో పదోతరగతి పరీక్షలపై భయం పోగొట్టే సదస్సు నిర్వహించే కంటే ప్రధానోపాధ్యాయుడే చైల్డ్ కౌన్సిలర్ పాత్ర పోషించాలన్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు సబ్జెక్టులపై క్విజ్ పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలోని 2300 పాఠశాలలున్నాయని, 1235 పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకు కోటి 9 లక్షల రూపాయలు రాజీవ్‌విద్యా మిషన్ ద్వారా మంజూరయ్యాయని, పాఠశాలల్లో నిధులున్నాయని చెప్పారు. 60 మందికి పైగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్ల నిర్వహణకు 1000, 100 మందికి పైగా విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలకు 1500, 150 మందికి పైగా ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలకు 2500 రూపాయల వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. మిగతా పాఠశాలలకు ఆర్‌ఎంఎస్, ఆర్‌విఎం నిధులను టాయిలెట్ల నిర్వహణకు ఖర్చు చేయవచ్చని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందని మాట వాస్తవమేనని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రైవేటు పాఠశాలలు సైతం ఒకటి నుండి పదో తరగతి వరకు ప్రభుత్వ పుస్తకాలనే వాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈసంవత్సరం ఒంటి పూట బడులు ఉండబోవని, విద్యార్థులు గైడ్‌లు వాడరాదని వివరించారు. 197 పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్పేందుకు తొమ్మిది వేల రూపాయల చొప్పున ఇచ్చారని, బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యతనిచ్చామని, మూడునెలల్లో కోర్సు పూర్తి చేయాలని చెప్పారు. విద్య, పారిశుధ్యం ప్రాధాన్యతగా బెస్ట్ స్కూల్స్ ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా ఉప విద్యాధికారి హరిశ్చందర్‌నాయక్, రిసోర్స్ పర్సన్‌లు మధుసూధన్‌రెడ్డి, విద్యాసాగర్, హరికృష్ణ, అజయ్‌సింగ్ పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పనుల పరిశీలన
మేడ్చల్, డిసెంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) పనులను క్షేత్రస్థాయిలో ఏ విధంగా కొనసాగుతున్నాయో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితసబర్వాల్, రాష్ట్ర వాటర్‌గ్రిడ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె సింగ్ బుధవారం మేడ్చల్ ప్రాంతాన్ని సందర్శించారు. పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపం వద్ద సంబంధిత అధికారులతో ఎస్‌కె సింగ్ వాటర్‌గ్రిడ్ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. పనులను పారదర్శకంగా చేపట్టేవిధంగా తరచూ పర్యవేక్షిస్తుండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తిచేసేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఈ బృహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టిందని అధికారులు కూడా అంతే నిబద్ధతతో పనులు జరిగే విధంగా అంకితభావంతో కృషి చేయాలని కోరారు. నిధులకు ఎలాంటి కొదవలేదని గుత్తేదారుకు వచ్చిన నిధులను వచ్చినట్లు మంజూరు చేయాలని తద్వారా పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా పనులు వేగంగా జరుగుతాయని పేర్కొన్నారు. స్థానికంగా అందరి సహాయంతో పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సలహలు సూచనలు చేయడంతో అధికారులు వెలిబుచ్చిన పలు అనుమానాలను నివృత్తి చేశారు. గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని డిపిఓ రమాదేవికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మేడ్చల్ కేంద్రంగా జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని కిలోమీటర్ల పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని గ్రామాలకు నీళ్లు అందిస్తారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మేడ్చల్ కేంద్రంగా 270 కిలోమీటర్ల పరిధి పైపులైన్ ద్వారా 104 గ్రామాలకు నీటిసరఫరా చేసే విధానాన్ని ఎస్‌కె సింగ్‌కు అధికారులు వివరించారు. అక్కడే నిర్మాణమవుతున్న సంపు నిర్మాణపు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో కలిసి సోమారం, డబిల్‌పూర్ గ్రామాలలో పర్యటించి వాటర్‌గ్రిడ్ పనుల పురోగతిని పరిశీలించి అధికారులు పలు సూచనలు చేశారు. అనంతనం ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు స్మితసబర్వాల్ మేడ్చల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఎస్‌కె సింగ్‌తో పాటు సంబంధిత అధికారులతో కలిసి మండలంలోని గిర్మాపూర్, ఘణపూర్ గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. పనుల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పనులను నిరాంటంకంగా వేగంగా గడువులోగా చేపట్టాలని ఆదేశించారు. అందుకు తగ్గ సహాయ సహకారాలను అధికారులు గుత్తేదారుకు విధిగా అందించి వాటర్‌గ్రిడ్ పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేయాలని ఆమె అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో వాటర్‌గ్రిడ్ ఎస్‌ఇ విజయపాల్‌రెడ్డి, సిఇ సురేశ్, ఇఇ నరేందర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ శ్రీనివాస్‌రెడ్డి, ఇఇ వెంకటరమణ, జడ్పీ సిఇఓ రమణారెడ్డి, మేడ్చల్ ఎంపిడిఓ దేవసహాయం, నగర పంచాయతీ కమిషనర్ రామిరెడ్డి, ఇఓపిఆర్డీ జ్యోతిరెడ్డి, ఎఇ శ్రీనివాస్‌రెడ్డి, శరణ్య, ఎంపిటిసి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులు శాస్తవ్రేత్తల సూచనలు పాటించాలి
చేవెళ్ల, డిసెంబర్ 16: రైతులు శాస్తవ్రేతలు, వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలని రంగారెడ్డి జిల్లా ఏరువాక కో ఆర్టినేటర్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్, నాబార్డు ఆధ్వర్యంలో బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో రైతుశిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేరుశనగ, శనగ, తెల్లకుసుమ పంటల్లో చీడపీడల నివారణపై యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు. సీజన్‌ను బట్టి పంటలు విత్తుకోవాలని సూచించారు. చలికాలం శనగపంట వేసుకుంటే పొట్ట దశ ఏపుగా పెరుగుతుందని, సీజన్ రాకముందే పంటవేసుకుంటే దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. పూత దశలో పురుగుల మందులు పిచికారి చేస్తే పచ్చపూరుగుల నుండి పంటలను కపాడుకోవచ్చని సూచించారు. పంట పైన పచ్చ పూరుగు అధికంగా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే దానికి సంబంధించిన సూచనలు, సలహాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఎ దేవ్‌కుమార్, ఏఇవో రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు.

విద్యారంగంలో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాం: నాయిని
గచ్చిబౌలి, డిసెంబర్ 16: తెలంగాణ రాష్ట్రాన్ని విద్యారంగంలో దేశంలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కావూరి హిల్స్‌లో వెలోసిటి ఐఐటి కోచింగ్ సెంటర్‌ని హోంమంత్రి ప్రారంభించి మాట్లాడుతూ, ఐఐటి విద్య చదివేవారి సంఖ్య పెరిగిందని, వెలోసిటి సంస్థ కూడా ఐఐటియన్లను తయారు చేయాలని సూచించారు. సామాన్య, మధ్య తరగతి విద్యార్థులకు కూడా ఐఐటి విద్య అందించడానికి ప్రైవేట్ విద్యాసంస్థలు ముందుకు రావాలన్నారు. అప్పుడే విద్యారంగంలో రాష్ట్రం ముందుంటుందని వివరించారు. సామాన్య, పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించినపుడే సమాజం అభివృద్ధి అవుతుందని, పేదరికాన్ని రూపుమాపవచ్చని హితవు పలికారు. విద్యారంగం అభివృద్ధికి సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి, కలెక్టర్ ఎవరి పిల్లలైనా ఒకే మెస్, ఒకే హాస్టల్, ఒకే డ్రెస్ వుండేలా తమ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. స్టడీ సర్కిల్స్ వల్ల విద్యార్థుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయని మరిన్ని ఏర్పాటుకు సన్నాహం చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో చిన్నారులు ఖాళీగా తిరగకూడదని బడి ఈడు పిల్లలను పాఠశాలలకు పంపాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. ప్రైవేటు కళాశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సెంటర్ డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ, వత్తిడి లేని నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమన్నారు. నగరంలో ఐదు ప్రదేశాలలో శిక్షణ సంస్థలు పనిచేస్తున్నాయని, సామాన్య, పేద విద్యార్థులకు అందుబాటులో వుండేలా చూస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విఎస్‌టి యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సంస్థ డైరెక్టర్లు వంశీకృష్ణ, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి
నార్సింగి, డిసెంబర్ 16: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని గత యేడాది కంటే ఈ యేడు ఎక్కువగానే భక్తులు దర్శించుకుంటారని అందుకు పూర్తి ఏర్పాట్లు ముందస్తుగానే చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం ఉదయం కార్వాన్ నియోజకవర్గం జియాగూడ శ్రీ రంగనాథస్వామి ఆలయానికి రాష్ట్ర మంత్రి వచ్చి పనులను పర్యవేక్షించారు. అనంతరం దేవాలయం నుంచి పూరానాపూల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఈనెల 21న వైకుంఠ ఏకాదశి పండుగ పురస్కరించుకుని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతిలో మాదిరిగానే వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందరు కలిసి, కుల, మతాలకు తావులేకుండా ప్రతి ఒక్కరు పనిచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులను అన్నింటిని పూర్తి చేస్తామని, సమయం ఎక్కువగా లేకపోవడంతో వెంటనే ఈ ప్రాంతంలో రోడ్లు, మంచినీరు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని