హైదరాబాద్

తెలుగు సంప్రదాయాలను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు కళలు, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రముఖ కవి రసమయి అధినేత డా.ఎంకే రాముకు ‘లలిత గేయ కళానిధి’ బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం దిల్లీ తెలుగు అకాడమీ, రెకాన్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రాముకు బిరుదుతో పాటు ‘స్వర్ణ కంకణం’ ప్రదానం చేశారు. మరుతున్న టెక్నాలజీతో యువతపై చెడు ప్రభావం పడుతుందని అన్నారు. రాము సాహిత్య రంగంలో అనేక సేవలు అందించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి సభాధ్యక్షత వహించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ.చంద్ర కుమార్, సుప్రసిద్ధ సాహితీవేత్త డా.తిరుమల శ్రీనివాసా చార్య, సుప్రసిద్ధ గాయకుడు డా.మహాభాష్యం చిత్తరంజన్, ప్రముఖ నటుడు డా.అక్కిరాజు సుందర రామకృష్ణ, సంస్థ అధ్యక్షుడు డా.ఎస్‌వీఎల్ నాగరాజు, చంద్రశేఖర్, ఆశాలత పాల్గొన్నారు.

అమర గాయకుడు ఘంటసాల
కాచిగూడ, డిసెంబర్ 4: తొలితరం సినిమా నేపథ్య గాయకులలో ప్రముఖుడు, అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల అని తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. ఘంటసాల జయంతి సందర్భంగా ‘ఘంటసాల స్వర వైభవం’ పేరిట సుదీర్ఘ గానవాహిని కార్యక్రమం ప్రముఖ గాయకుడు డా.టీ.శరత్ చంద్ర నిర్వహణలో బుధవారం రవీంద్ర భారతి సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శివకుమార్ పాల్గొని ఘంటసాల చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఘంటసాల తెలుగు సినీ సంగీతం విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదం చేశారని కీర్తించారు. శరత్ చంద్ర ఘంటసాల వైభవం పేరిట అనేక మంది గాయకులను శిక్షణ ఇచ్చి ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. ఆనంద్ నాయుడు, బయ్యపురెడ్డి, డా.డీ.విజయ భాస్కర్, ఘంటసాల ఆఫ్ ఆర్గనైజేషన్ సీఈవో శివరమ్య, సత్య కుమారి పాల్గొన్నారు.

ఉన్నవ లక్ష్మీనారాయణ సేవలు
చిరస్మరణీయం
కాచిగూడ, డిసెంబర్ 4: ప్రముఖ సాహితీవేత్త ఉన్నవ లక్ష్మీనారాయణ సాహిత్య రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ బుద్దా మురళి కీర్తించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ జయంతి సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బుద్దా మురళి పాల్గొని ఉన్నవ లక్ష్మీ నారాయణ చిత్రపటానికి నివాళి అర్పించి సాహిత్య రంగానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ సాహితీవేత్త డా.తెనే్నటి సుధాదేవి, నోరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ, సంగీత గురువు సంయుక్త పాల్గొన్నారు.