హైదరాబాద్

ఆర్‌జీవీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్‌జీవీ)పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కేఏ పాల్ చారిటీ ట్రెజరర్ జ్యోతి కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఫొటోను మార్ఫింగ్ చేయడంతో పాటు కేఏ పాల్‌ను అవమానపరిచే విధంగా ట్వీటర్‌లో పోస్టులు చేసిన వర్మపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని చెప్పారు. కేవలం పేరు మాత్రమే మార్చిన సినిమాకు సెన్సార్‌బోర్డు అనుమతి ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీలో ఉన్న జీవిత రాజశేఖర్ సైన్సార్ బోర్డు రివ్యూ మెంబర్‌గా ఉండటం ఏమిటని స్కైప్ ద్వారా కేఏ పాల్ ప్రశ్నించారు. వివాదస్పద సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు.