హైదరాబాద్

తొలగిన అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో సుమారు రెండులక్షల పై చిలుకు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే బడా భవనాల అనుమతులకు ఎట్టకేలకు అడ్డంకులు తొలిగాయి. ఈ బడా నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీతో పాటు కాలుష్య నియంత్రణ మండలి కూడా ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉండగా, చాలాకాలం క్రితం కమిటీ గడువు ముగియటంతో, ఆ తర్వాత కమిటీ తిరిగి నియమించకపోవటంతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల్లో ఈ దరఖాస్తులు పేరుకుపోయాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్‌మెంట్ కమిటీ నియామకానికి అనుమతివ్వటం, కమిటీ నియమించటంతో ఇక జీహెచ్‌ఎంసీ చకచక అనుమతులను జారీ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు గాను ప్రతి శుక్రవారం మల్టీ స్టొరెడ్ బిల్డింగ్ అనుమతుల దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీలో పెండింగ్‌లో ఉన్న 70 బడా అనుమతుల దరఖాస్తులను జీహెచ్‌ఎంసీ పరిశీలించి, అనుమతులు జారీ చేస్తే రూ. 200 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముంది. అసలే ఆర్థిక సంక్షోభం, పైగా సిబ్బంది జీతభత్యాలు, రొటీన్ మెయింటనెన్స్ కూడా గగనమైన నేపథ్యంలో ఈ రకంగా ఎన్విరాన్‌మెంట్ కమిటీ ఏర్పాటు కావటం, అనుమతులు జారీ చేసేందుకు దరఖాస్తులు సిద్ధంగా ఉండటంతో జీహెచ్‌ఎంసీకి ఆర్థికంగా కొంత వరకు కలిసొచ్చిందని చెప్పవచ్చు. హెచ్‌ఎండీఏలో కూడా పెండింగ్‌లో ఉన్న మరో 80 దరఖాస్తులను ఈ రెండు విభాగాలు ప్రస్తుతం స్క్రూటినీ పూర్తి చేశాయి. ఈ మొత్తం దరఖాస్తులను కమిటీ సమావేశంలో సమర్పించి, కమిటీ క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే అనుమతులు జారీ చేయనున్నారు. ఒక్కసారి కమిటీకి పంపే ముందు దరఖాస్తుదారులు సమర్పించిన డాక్యుమెంట్లను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు పరిశీలించి, షార్ట్ఫాల్ క్లియర్ అయిన తర్వాతే కమిటీకి పంపితే, కమిటీ తొందరగా ఆమోదం తెలిపే అవకాశముందని, ఆ తర్వాత సంబంధించిన ఫీజులను స్వీకరించి, అనుమతులు జారీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు సిద్ధంగా ఉన్నారు.