హైదరాబాద్

వ్యక్తిత్వంతోనే విద్యార్థులకు భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: వ్యక్తిత్వమే విద్యార్థుల భవిష్యత్ అని పలువురు వక్తలు అన్నారు. దిస్లేట్ స్కూల్ (అమీర్‌పేట్) 15వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం లలిత కళాతోరణంలో నిర్వహించారు. సినిమాలు, సీరియళ్లు, మల్టీమీడియా గేమ్స్ బాల్యంలో పిల్లలను ప్రభావితం చేస్తాయని, విద్యార్థులు ప్రదర్శనల ద్వారా ఎంతో అద్భుతంగా తెలియజేశారు. బాల్యంలో పిల్లలపై బలంగా పడే ప్రభావం వారి భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దుతుందో విద్యార్థులు ప్రదర్శించిన ‘బాలమిత్రుల కథ’లో వివరించారు. దాదాపు 25 పాత్రలు భిన్న మనస్తత్వాలు, భిన్న పోకడల సంకిక్షప్త రూపంగా బాలమిత్రుల కథలు రూపొందించారు. విద్యార్థులే వ్యాఖ్యాతలుగా వ్యవహరించి పాత్రలలో అలరించారు.
టీవీజేఏ నూతన కార్యవర్గం ఎన్నిక
ఖైరతాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ వీడియో జర్నలిస్టు అసోసియేషన్ (టీవీజేఏ) నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా టీన్యూస్‌లో పనిచేస్తున్న పీ.ప్రకాష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వనం నాగరాజు విజయం సాధించారు. ట్రెజరర్‌గా బిక్షపతి, ఉపాధ్యక్షునిగా జనార్దన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీగా రవికాంత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీడియో జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్ కృషి చేస్తుందని ప్రకాష్ తెలిపారు.