హైదరాబాద్

పేరిణికి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పేరిణి నృత్యకళకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని మంత్రి కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యుడు, సీసీఆర్‌టీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ తాడేపల్లిని కోరారు. ఆదివారం మంత్రి నివాసంలో తాడేపల్లి భేటీ అయ్యారు. ఈనెల 22న రవీంద్ర భారతిలో జరుగనున్న వేదాంతం రాఘవయ్య శతజయంతి కార్యక్రమంలో మంత్రిని ఆహ్వానించడానికి వచ్చినట్లు తెలిపారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి రెంటాల గోపాలకృష్ణ
కాచిగూడ, డిసెంబర్ 15: బహుముఖ ప్రజ్ఞాశాలి రెంటాల గోపాల కృష్ణ అని పలువురు వక్తలు అన్నారు. ప్రముఖ అభ్యుదయ కవి, శతాధిక గ్రంథకర్త రెంటాల గోపాల కృష్ణ శత జయంతి వేడుకల సభ హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ఓ దిన పత్రిక ఎడిటర్ కే.శ్రీనివాస్, ప్రముఖ సాహితీవేత్త, రాజకీయ విమర్శకుడు తెలకపల్లి రవి, దర్శక, నిర్మాత బీ.నరసింగ రావు, రెంటాల స్మరణోత్సవ సంఘం అధ్యక్షుడు కేపీ అశోక్ కుమార్, ప్రముఖ కవి అఫ్సర్ పాల్గొని రెంటాల గోపాల కృష్ణ చిత్రపటానికి నివాళి అర్పించి ప్రసంగించారు. రెంటాల గోపాల కృష్ణ అన్ని రంగాల్లో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. అనువాదకునిగా చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. అభ్యుదయ కవిగా అనేక రచనలు సరళమైన భాషలో రచించారని వివరించారు. తెలుగు భాష పట్ల ఎంతో పట్టుందని, సాహిత్య రంగంలో వైవిధ్య భారితమైన సాహసలు చేశారని కీర్తించారు. భవిష్యత్‌లో రెంటాల గోపాల కృష్ణ రచించిన రచనలు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. ఆయన రచనలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. శత జయంతి వేడుకలను నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు.