హైదరాబాద్

త్యాగరాజ స్వామి కీర్తనలు విశ్వవ్యాప్తం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: శ్రీత్యాగరాజ స్వామి కీర్తలను విశ్వవ్యాప్తం చేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. సద్గురు శ్రీత్యాగరాజ స్వామి 173వ ఆరాధనోత్సవాలు శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందిని సిధారెడ్డి పాల్గొని ప్రసంగించారు. త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను జరుపుకోవాడం సంతోషదాయకమని అన్నారు. వైద్యుల మైత్రేయి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో వైఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వైఎస్‌ఆర్ మూర్తి, గాయకుడు త్రినాథ రావు, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

తెనే్నటి సుధాదేవికి పురస్కారం ప్రదానం
కాచిగూడ, జనవరి 16: ప్రముఖ సాహితీవేత్త ఊటుకూరు రత్న సుందరి జయంతి సందర్భంగా ప్రముఖ రచయిత్రి డా.తెనే్నటి సుధాదేవికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానోత్సవ సభ రక్ష ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర కార్మిక శాఖ ప్రధాన సలహాదారుడు వల్లూరి జయప్రకాష్ నారాయణ, స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ ఏజీఎం విరించి పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. తెనే్నటి సుధాదేవి సాహిత్య రంగంలో అనేక సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆమెకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. సభకు ముందు నిర్వహించిన సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, గోవిందనామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వెంకటేశ్వర రావు, ప్రముఖ న్యాయవాది ఉమా శంకర రావు, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, సంస్థ కార్యదర్శి కన్యాకుమారి పాల్గొన్నారు.