హైదరాబాద్

పెడదోవ పడుతున్న యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో యువత పెడదారి పడుతుంది. మద్యం, మదాకద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు. ఇరు రాష్ట్రాల నుంచి ఉన్నత చదువుల కోసం నగరానికి వస్తున్న యువత చెడు మార్గాల వైపు ఆకర్శితులై తమ జీవితాలను నరకప్రాయం చేసుకుంటూ, కన్నవారి కన్నీటికి కారణం అవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట సరదాగా స్నేహితుల ద్వారా మద్యం, దూమపానం వంటివి సేవిస్తున్న యువతీ, యువకులు అనంతరం వాటిని నిరంతరం తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఉత్సాహం ఉరకలు వేసే వయసులో స్నేహితులు, పరిచయస్తుల ద్వారా మత్తు పదార్ధాలకు అలవాటు పడుత్ను వారు అంతకు మించిన ఆనందం కోసం తపిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ మండల పోలీస్‌స్టేషన్ల పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్సార్‌నగర్ వంటి ప్రాంతాల్లో యువతనే లక్ష్యంగా చేసుకొని వెలుస్తున్న పబ్‌లు, ఫైవ్‌స్టార్ హాటళ్లు నైతిక విలువలు, ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి తమ వ్యాపారాన్ని నిర్వహించుకుంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. మసక మసక చీకట్లో, లయబద్దంగా సాగే సంగీతానికి, అర్ధనగ్న నృత్యాలు తోడవడంతో పెగ్గు మీద పెగ్గు సేవిస్తూ, మైమరిచిపోతున్నారు. వయోపరిమితిని పరిగణనలోనికి తీసుకోకుండా అడిగినంత మద్యం సరఫరా చేస్తున్న వ్యాపారులు వారిని మద్యానికి బానిసలుగా చేస్తున్నారు. అక్కడ మాటువేసిన కొందరు మరింత ఆనందం పొందేందుకు తమ వద్ద మందు ఉందంటూ యువతకు డ్రగ్స్‌ను పరిచయం చేస్తున్నట్టు సమాచారం. ప్రారంభంలో వాటిని ఉచితంగా అందజేసి, వాటికి అలవాటుపడి కావాలంటూ వచ్చే వారి నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీటికి బానిసలైన వారు చదువు, ఇతర అవసరాల కోసం తల్లిదండ్రులు పంపిన డబ్బును ఇందు కోసం వాడుకుంటున్నారు. అప్పటికీ చాలక వారిని ఆశ్రయించే వారికి ఇతరులకు విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని మరికొంత మందికి వీటిని అలవాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. నగరంలో మద్యం, డ్రగ్స్ వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నత చదువులు అభ్యసించేందుకు నగరానికి వస్తున్నవారు నివసిస్తున్న హాస్టళ్లు, బ్యాచ్‌లర్ గదుల్లో ఈ తరహా అసాంఘిక కార్యకలాపాలు అధికంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. గతంలో కేవలం సంపన్న వర్లాకు చెందిన యువత మాత్రమే వీటి బారిన పడే వారని, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత సైతం వీటికి బానిసలు అవుతుండటం గమనార్హం.