హైదరాబాద్

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు ఆత్మగౌరవ ప్రతీక ఎన్‌టీఆర్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి అన్నారు. ఎన్‌టీఆర్ వర్దంతి సందర్భంగా ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.కే.బ్రహ్మనందకు ‘ఎన్‌టీఆర్ లలిత కళా’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం ఎన్‌టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేవీ రమణా చారి పాల్గొని బ్రహ్మనందానికి పురస్కారం ప్రదానం చేశారు. ఎన్‌టీఆర్ నటుడిగానే కాకుండా రాజకీయంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. గాయనీ, గాయకులు సురేఖా మూర్తి, వెంకట రావు, ఆమని, సుభాష్ అలపించిన సినీ గీతాలు అలరించాయి. సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్ పీ.విజయ బాబు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రజానటి డా.జమున, ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకుడు డా.డీ.విజయ భాస్కర్, రంగస్థల నటుడు డా.మీగడ రామలింగ స్వామి, ఎన్‌టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్‌పర్సన్ డా.ఎన్.లక్ష్మీ పార్వతి స్వాగతం పలికారు.
యెల్లా వెంకటేశ్వర రావుకు
మృదంగ ప్రభాచార్య పురస్కారం
కాచిగూడ, జనవరి 18: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, శాస్ర్తియ సంగీత నృత్యాల ఔన్నత్యాన్ని అమెరికాలో చాటిచెబుతున్న గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు అభినందనీయులని భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్) డైరెక్టర్ వై.లక్ష్మాజీ రావు అన్నారు. యెల్లా వెంకటేశ్వర రావుకు మృదంగ ప్రభాచార్య పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ, ఐసీసీ ఆర్, తెలంగాణ సంగీత నాటక అకాడమి, వంశీ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ‘తాన్‌సేన్ త్యాగరాజ సంగీత’ నృత్యోత్సవాలు శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లక్ష్మాజీ రావు పాల్గొని మృద్వాంసురాలు ప్రభావతి దేవి తమిరిశ జ్ఞాకకార్ధం మృదంగ ప్రభాచార్య పురస్కారం పద్మశ్రీ యెల్లా వెంటేశ్వర రావుకు ప్రదానం చేశారు. యెల్లా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక పురస్కారాలు అందుకున్నప్పటికి ప్రభావతి పేరిట నెలకొల్పిన పురస్కారం తాను స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి, డాక్టర్ వనజా ఉదయ్, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, సీత మాడభూషి, ఇంద్రదేవ్ పాల్గొన్నారు. డా.మైసూర్ మంజునాథ్ కర్ణాటక రాగాలతో అమెరికా ఇంద్రదీప్ ఘోష్ హిందుస్థానీ రాగాలతో ప్రదర్శించిన వయోలిన్ ఆకట్టుకుంది. ప్రమఖ నర్తకుడు పీ.మృత్యంజయ శర్మ, కూచిపూడి కళాకారిణి ఆర్తి శంకర్ ప్రదర్శించిన కథక్ నృత్య ప్రదర్శనలు అలరించాయి.