హైదరాబాద్

అమరగాయకుడు ఘంటసాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: అమర గాయకుడు ఘంటసాల అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. ఘంటసాల కుమారుడు రత్నకుమార్‌కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు బహూకరణ సభ జీపీ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి సాయికృష్ణ హోటల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సముద్రాల వేణుగోపాల చారి పాల్గొని రత్నకుమార్‌కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డును బహూకరించారు. ఘంటసాల వారసత్వానికి సంకేతం రత్నకుమార్ అని కొనియాడారు. ఘంటసాల సజీవంగా లేకపొయినా పాట రూపంలో తెలుగు జాతి ఉన్నంత వరకు బతికి ఉంటాడని పేర్కొన్నారు. గాయకుడు త్రినాథ రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.చింతపట్ల వెంకట చారి, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, ఘంటసాల గానసభ అధ్యక్షుడు కేవీ రావు, అర్చన వెంకటేశ్వర రావు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస నాయుడు, పీ.నాగేంద్ర రావు పాల్గొన్నారు. సభకు ముందు గాయనీ, గాయకులు అలపించిన సినీ గీతాలు అలరించాయి.
అలరించిన ‘త్యాగరాయ కీర్తనలు’
కాచిగూడ, జనవరి 19: శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సద్గురు శ్రీత్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు సందర్భంగా శివపార్వతి బృందంచే ‘త్యాగరాయ కీర్తనలు’ ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ చారిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. నృత్య గురువు శివ పార్వతి శిష్య బృందం అలపించిన త్యాగరాజ స్వామి కీర్తనలు అలరించాయి. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, కినె్నర కార్యదర్శి మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.
రాజ రామన్నకు వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రదానం
కాచిగూడ, జనవరి 19: ప్రముఖ గాయకుడు రాజా రామన్న 12 గంటల 30 నిమిషాలు నిర్విరామ సంగీత విభావరీ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా కోఅర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, స్వర్ణశ్రీ పాల్గొని గాయకుడు రాజా రామన్నను సత్కరించి అభినందించారు. 12 గంటల పాటు నిర్విరామంగా సంగీత విభావరీ నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకోవడం సంతోషదాయకమని అన్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.

స్వామి వివేకానంద ఆదర్శనీయం
కాచిగూడ, జనవరి 19: స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ‘వివేకానంద ఎక్సలెన్సీ’ అవార్డులతో పాటు నృత్య గురువులకు ‘నాట్య రవళి’ అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రమం కీర్తి ఆర్ట్స్ అకాడమీ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సముద్రాల వేణుగోపాల చారి పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. జాతిని జాగృతం చేయాడానికి స్వామి వివేకానంద విశిష్ట కృషి చేశారని పేర్కొన్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలోగానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సుధాకర్, కవి బీక్కీ కృష్ణ, సంస్థ అధ్యక్షురాలు బిందు నిమ్మ పాల్గొన్నారు.

ధ్వన్యనుకరణ కళా పీఠాధిపతి
డా.నేరెళ్ల వేణుమాధవ్
కాచిగూడ, జనవరి 19: ప్రముఖ మిమిక్రీ కళాకారుడు జీవీఎస్ రాజు రచించిన ‘్ధ్వన్యనుకరణ కళా పీఠాధిపతి డా.నేరెళ్ల వేణుమాధవ్’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసీవోఎస్ వీవీ సత్యనారాయణ రెడ్డి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. సద్గురు డా.నేరెళ్ల వేణుమాధవ్ మిమిక్రీ కళ వ్యాప్తి చెందాలని అనేక మంది శిష్యులను తయారు చేశారని పేర్కొన్నారు. మిమిక్రీ రంగంలో ఎంతో మంది కళాకారులు రాణిస్తున్నారని తెలిపారు. వేణుమాధవ్ జీవిత విశేషాలను జీవీఎస్ రాజు ఎంతో అద్భుతంగా పుస్తక రూపంలో తీసుకొచ్చారని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఆది నారాయణ, నెరేళ్ళ శోభా వేణుమాధవ్, రవి పాల్గొన్నారు.
జాతి నిర్మాణంలో
భాషా ఉపాధ్యాయుల పాత్ర కీలకం
కాచిగూడ, జనవరి 19: జాతి నిర్మాణంలో భాషా ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమైందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర డైరీతో పాటు క్యాలెండర్‌ను ఆదివారం రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఎస్ రాములు పాల్గొని ప్రసంగించారు. గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయడంతో భాషా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ భాషా ఉపాధ్యాయులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. భాషా ఉపాధ్యాయులకు జీవో 151 ప్రకారం పదోన్నతులకు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సంస్థ ప్రధాన కార్యదర్శి కార్రెం గౌరీశంకర్ రావు, గౌరవ అధ్యక్షుడు పెండ్యాల భ్రమయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహ్మద్ బషీర్, ప్రతినిధులు మర్రిపెల్లి రమేష్, కుమార స్వామి, లింగమూర్తి, శ్రీ్ధర స్వామి, ప్రవీణ్, జగదీష్ పాల్గొన్నారు.