హైదరాబాద్

కారణజన్ముడు ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: కారణజన్ముడు నందమూరి తారక రామారావు అని తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ బదిమి శివకుమార్ అన్నారు. ఎన్‌టీ ఆర్, ఎఎన్‌ఆర్ నట చక్రవర్తుల నివాళి సందర్భంగా ప్రముఖ గాయకుడు శరత్ చంద్ర నిర్వహణలో ‘ఘంటసాల విజయభేరి’ పేరిట సినీ సంగీత విభావరి సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శివకుమార్ పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. గాయనీ, గాయకులు అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో ఘంటసాల మహిళా సంగీత కళాశాల కరస్పాండెంట్ ఎం.సత్యనారాయణ, లక్ష్మీ గోపాల్ పాల్గొన్నారు.

‘వృద్ధోపనిషత్’
అనువాద గ్రంథాలు ఆవిష్కరణ
కాచిగూడ, జనవరి 20: ప్రముఖ కవి ఆచార్య ఎన్.గోపీ రచించిన ‘వృద్ధోపనిషత్’ పుస్తకాన్ని రచయితలు ఆర్.శాంత సుందరి, ఎం.శ్రీ్ధర్ హిందీ, ఇంగీషు అనువాద గ్రంథాల ఆవిష్కరణ సభ కినె్నర ఆర్ట్ థియేటర్స్, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. వృదాప్య దశలో మానసిక పరిణామాలను, స్థితిగతులను ఎంతో అద్భుతంగా పుస్తకంలో వివరించారని పేర్కొన్నారు. సరికొత్త కోణంలో ఆవిష్కరించారని తెలిపారు. ఒక్క భాషకే పరిమితం కాకుండా అన్ని భాషలలో పుస్తకాలను అనువాదించాలని అన్నారు. ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించగా కవి వీ.హర్షవర్ధన్, కవి కిల్లాడ సత్యనారాయణ, సిరిసిల్ల చందన, సంస్థ కార్యదర్శి మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.
అలరించిన త్యాగరాజ కీర్తనలు
కాచిగూడ, జనవరి 20: సద్గురు త్యాగరాజ స్వామి జయంతి సందర్భంగా శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరాధనోత్సవాల్లో భాగంగా ప్రముఖ సంగీత గురువు మల్లాది ఉష బృందం త్యాగరాయ కీర్తనలు సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమాచార హక్కు చట్టం కమిషనర్ బుద్దా మురళి పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సాహిత్య అకాడమి అధ్యక్షుడు చొక్కాపు వెంకట రమణ, గిడుగు ఫౌండేషన్ అధ్యక్షుడు కాంతి కృష్ణ పాల్గొన్నారు.
తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలి
కాచిగూడ, జనవరి 20: తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలని అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కరకాల కృష్ణారెడ్డి అన్నారు. నాట్యాంజలి డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో ‘సంగీత నృత్యాలు కళారాధన’ కార్యక్రమం సోమవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరకాల కృష్ణారెడ్డి పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి న్యాయమూర్తి బూర్గుల మధుసూదన్, రఘువెంకట సురేష్ కుమార్, కావూరి శ్రీనివాస్, కురుగంటి కళాక్షేత్రం అధ్యక్షురాలు కే.రాధిక, సంస్థ అధ్యక్షురాలు నామిరెడ్డి జాహ్నవి పాల్గొన్నారు.