హైదరాబాద్

‘బేటీ బచావో-బేటీ పడావో’పై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘బేటీ బచావో-బేటీ పడావో’ కార్యక్రమంపై ప్రజలను మరింత చైతన్యవంతులను చేసేందుకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ జి. రవి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ఫోర్సు కమిటీ సమావేశంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, విద్యా, ఆరోగ్య శాఖల సంయుక్త్ధ్వార్యంలో నిర్వహించిన ‘బేటీ బచావో-బేటీ పడావో’ కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు. జేసీ మాట్లాడుతూ బాలికల పరిరక్షణ గురించి ప్రజల్లో పూర్తి స్థాయిలో చైతన్యం తీసుకురావటమే బాలికా దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు, అసమానతలను నిర్మూలించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆడ పిల్లల పట్ల చిన్నచూపు లేకుండా బాలురలతో సమానంగా ప్రోత్సహించేలా తల్లిదండ్రులు తమవంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. బాల్య వివాహాలు చేయటం ఒక సామాజిక దురాఛారమని, దాన్ని రూపుమాపేందుకు ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. బాలికలను ఆరోగ్యంగా ఉంచి, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంతకాల సేకరణను ప్రారంభించి, బేటీ బచావో అంశంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి మదుసూధన్ రావు, ఆర్డీఓలు వసంత కుమారి, శ్రీను, జిల్లా సంక్షేమాధికారి ఝాన్సీలక్ష్మిబాయి, ఎస్‌పీహెచ్‌ఓ రాజశ్రీ, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ తదితరులు హాజరయ్యారు.