హైదరాబాద్

ఆదాయ పెంపు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని కోటి పై చిలుకు జనాభా అవసరాలకు అనుగుణంగా పౌరసేవల నిర్వహణ, అత్యవసర సేవలు, ఆధునిక అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఆదాయ పెంపునకు చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు. 20 మంది యువ ట్రెయినీ ఐఏఎస్ అధికారులకు సోమవారం ఆయన ప్రధాన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జనాభాలో మూడో వంతు ప్రజలు హైదరాబాద్ నగరంలోనే జీవిస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఇప్పటికే మెట్రోరైలును అందుబాటులోకి తేవటంతో పాటు ఎస్‌ఆర్‌డీపీ కింద ఎన్నో ఆధునిక రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. జీహెచ్‌ఎంసీ నగరవాసులకు అందిస్తున్న అతి ముఖ్యమైన సేవల్లో శానిటేషన్ ఒకటి అని, ప్రతి ఇంటి నుంచి చెత్తను శాస్ర్తియంగా సేకరించేందుకు 2016లో రిక్షాల స్థానంలో స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అంతేగాక, చెత్త సేకరణ కార్యక్రమం మరింత విజయవంతంగా సాగేందుకు వీలుగా నగరంలోని 22లక్షల గృహాలకు తడి,పొడి చెత్తకు వేర్వేరుగా రెండేసి బిన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. సేకరించిన చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుల్లో ఆధునిక పద్దతిలో క్యాపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ప్రతిరోజు 6వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని, దీంతో జవహర్‌నగర్‌లో 20 మెగా వాట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంటును నిర్మించినటుల్తెలిపారు. నూటికి నూరు శాతం చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్ల కోసం 340 మంది బిల్ కలెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఆస్తిపన్ను బకాయిలను ఇంటి యజమానులకు గుర్తు చేసేందుకు 11లక్షల మొబైల్ నెంబర్లకు ఎస్‌ఎంఎస్‌లను పంపుతున్నట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం వసూలయ్యే ఆస్తిపన్నులో మూడో వంతు ఆన్‌లైన్ చెల్లింపులే జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 2017-18లో రూ.1400 కోట్ల మేరకు ఆస్తిపన్ను వసూలు కాగా, ఈ సంవత్సరం రూ.1800 కోట్లను టార్గెట్‌గా పెట్టుకోగా, అదనంగా రూ.200 కోట్లు అంటే రూ.1600 కోట్ల వరకు వసూలయ్యే అవకాశమున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మించుకుని, ఆక్రమించే భవనాలకు 2డీ బేస్ మ్యాపింగ్ విధానం ద్వారా ఆస్తిపన్నును ఆన్‌లైన్ సిస్టమ్‌లో పారదర్శకంగా విధిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కమిషనర్‌లు జయరాజ్ కెనడీ, ఉపేందర్ రెడ్డి, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ వ్యాల్యుయేషన్ ఆఫీసర్ మహేశ్ కులకర్ణి పాల్గొనగా, ట్రెయినీ ఐఏఎస్‌ల పర్యటనకు ఏ.రాజ్‌కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.