హైదరాబాద్

ఆగిన మైకుల హోరు.. ముగిసిన ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, షాద్‌నగర్ రూరల్: రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారాలకు తెరపడింది. ఎన్నికల నిబంధనల ప్రకారం సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించుకోవాలని ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు అదే దిశగా కొనసాగించారు. దాదాపు వారం రోజుల పాటు మైకుల శబ్ధాలతో దద్ధరిల్లిన షాద్‌నగర్ ఒక్కసారిగా మైకులకు తాళం పడటంతో నిశబ్ధంగా మారిపోయింది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలను ముగించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని, సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారాలు చేయరాదని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రిటన్నింగ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓటర్లను ప్రలోబాలకు గురి చేస్తే వారిపై తగిన చర్యలు ఉంటాయని అంటున్నారు. ఓటరు దేవుళ్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకునేందుకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు జనవరి 22వ తేది నిర్వహించనున్న నేపథ్యంలో ఆ దిశగా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. షాద్‌నగర్ మున్సిపల్‌లోని 28వార్డుల్లో మొత్తం 59 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు.