హైదరాబాద్

తెనే్నటి సుధాదేవికి సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: రసమయి సంస్థ స్వర్ణోత్సవాలు సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డా.తెనే్నటి సుధాదేవికి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం రసమయి, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని తెనే్నటి సుధాదేవికి పురస్కారం ప్రదానం చేశారు. సుశీలా నారాయణ రెడ్డి సాహిత్య రంగంలో అనేక సేవలు అందించారని పేర్కొన్నారు. ప్రముఖ నృత్య గురువులు పద్మశ్రీ, రేణుక ప్రభాకర్, ఝాన్సీరాం శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి సభాధ్యక్షత వహించగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ భవాని ప్రసాద్, ప్రముఖ రచయిత్రి డా.సీ.మృణాళిని, జలంధర, సంస్థ అధ్యక్ష, కార్యదర్శి డా.ఎంకే రాము, ఎంకేఆర్ ఆశాలత పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, జనవరి 21: బాలాజీ మ్యూజికల్స్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. ప్రముఖ గాయకుడు టీ.రామోజీ నిర్వహణలో గాయనీ, గాయకులు లక్ష్మీ పద్మజ, లలితా రావు, జ్యోతి, వేణుగోపాల్, టీవీ రావు, కామేశ్వర రావు, ఎవీ రమణ, భరద్వాజ, రాజ్యలక్ష్మీ, శశిరేఖ, కవిత, అరుణ, భాను అలపించిన సినీ గీతాలు అలరించాయి.
కడుపుబ్బ నవ్వించిన ‘కామెడీ షో’
ఫ్రెండ్స్ కామెడీ క్లబ్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘కామెడీ షో’ మంగళవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ కార్యదర్శి బండి శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయుడు జనార్దన రావు పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. ప్రముఖ హస్య నటుడు ఎంవీ సుబ్రహ్మణ్యం నిర్వహణలో జబర్ధస్త్ ప్రకాశ్, వీరయ్య, జీవీ లక్ష్మీ, రవి, కామేశ్వర రావుప్రదర్శించిన ‘అమ్మాయి తెలివి, కోరుకున్నా.. అంతే, పొదుపు, పెస్ట్, అభిమాని, ఉచితం, పేకాట’ తదితర హాస్య స్కీట్స్‌ను ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.