హైదరాబాద్

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ హరీష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 351 మున్సిపల్ వార్డుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో 1278 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 64,0366 తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.
ఇందులో 3,29,261 మంది పురుషులు, 31,1037 మంది మహిళలు, 68 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోసం 89 మంది జోనల్ అధికారులు, 146 మంది రిటర్నింగ్ అధికారులు, 144 మంది సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమించడం జరిగిందని చెప్పారు. 1055 ప్రీసైడింగ్ అధికారులు, 1055 ఏపీ ఓలు, 3159 ఓపీ ఓలు ఎన్నికల విధుల్లో ఉంటారని అన్నారు. 103 రూట్లుగా విభజించి ఎన్నికల సమాగ్రీ తరలించేందుకు 180 వాహనాలను సిద్దం చేసినట్టు చెప్పారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కు వేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగా రెండు నేటి సాయంత్రం ఐదు గంటల వరకు మద్యం దుఖానాలు మూసివేయాలని ఆదేశించామని చెప్పారు. 959 పోలింగ్ కేంద్రాలకు గాను 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, 12 అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్టు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు.
ఎన్నికలు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు బ్యాంకులు ఇతర కార్యాలయాలకు సెలవు ప్రకటించామని చెప్పారు. ప్రతి పౌరుడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.