హైదరాబాద్

సమర శంఖారావం పురించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: సాయుధ పోరాటంలోనే స్వాతంత్య్రం సిద్ధిస్తుందని సమర శంఖారావం పూరించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వకుళాభరణం కృష్ణమోహన రావు పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్ర పటానికి నివాళి అర్పించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సూరంపూడి శ్రీమణి, నృత్య గురువు రేణుకా ప్రభాకర్ పాల్గొన్నారు.
తెలుగు పండితుడికి సత్కారం

హైదరాబాద్, జనవరి 23: గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్, వెనె్నల పబ్లికేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో వెలువరించిన ముత్యాల గొడుగు పుస్తకంలో ‘చరిత్ర మరవని మనిషి’ కవిత రాసినందుకు డాక్టర్ ఎస్.విజయ్ భాస్కర్‌ను ఘనంగా సత్కరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ముత్యాల గొడుగు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పురానాపూల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విజయ్ భాస్కర్‌కు కవిత సత్కారం లభించడం పట్ల అభినందించారు. భాస్కర్‌ను పాఠశాల ప్రధానో ఉపాధ్యాయురాలు పద్మజా కుమారితో పాటు అధ్యాపకుల బృందం అభినందించారు. 2012లో గిడుగు రామమూర్తి అవార్డును కూడా భాస్కర్ అందుకున్నారు.