హైదరాబాద్

కుక్కల నియంత్రణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో కుక్కల బెడదను నివారించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు బల్దియా సిద్ధమైంది. ఏదైనా సంఘటన జరిగితే తప్ప కళ్లు తెరవని అధికారులు కొద్దిరోజుల క్రితం అమీర్‌పేటలో జరిగిన ఘటనపై స్పందించి, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కుక్కల సమస్య ఉన్న ప్రాంతవాసులు ఫిర్యాదు చేసేందుకు జీహెచ్‌ఎంసీ టోల్‌ఫ్రీ నెంబర్ 040-21111111కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా నగరంలోని వీధి కుక్కలున్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు వాటిని పట్టుకుని, వాటికి బర్త్‌కంట్రోల్ చేసేందుకు స్టెరిలైజేషన్ చేయటంతో పాటు అవి కాటు వేసినా, బాధితులకు రాబిస్ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్లు కూడా ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి పనులను పర్యవేక్షించేందుకు జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకంగా వెటర్నరీ విభాగాన్ని ఏర్పాటు చేసినా, కొద్దిరోజులుగా ఆ విభాగం పనిచేస్తుందో లేదో అనే పరిస్థితి నెలకొంది. కానీ కొద్దిరోజుల కితం అమీర్‌పేటలో చోటుచేసుకున్న ఘటనతో ఉన్నతాధికారులు ఈ విభాగం పనితీరుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరంలో కుక్కల సమస్యను పరిష్కరించేందుకు గాను నగరంలోని ఆటోనగర్, చుడీబజార్, పటేల్‌నగర్, కేపీహెచ్‌బీకాలనీ, జీడిమెట్ల ప్రాంతాల్లో యానిమల్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 39346 కుక్కలకు స్టెరిలైజేషన్ చేయగా, మరో 62139 కుక్కలకు యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు తెలిపిన అధికారులు మున్ముందు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని చెబుతున్నారు. దీనికి తోడు బ్లూక్రాస్, పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కాలనీలు, మురికివాడల్లో బర్త్ కంట్రోల్ కోసం స్టెరిలైజేషన్, యాంటీ రాబిస్ వాక్సిన్లు ఇచ్చే ప్రక్రియను మరింత ముమ్మరం చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు.
ఉచితంగా వ్యాక్సిన్లు
కుక్క కాటుకు గురైన వ్యక్తులకు ఇచ్చే యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు ప్రభుత్వ ఉచితంగా అందజేస్తున్నట్లు బల్దియా అధికారులు తెలిపారు. నగరంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిసిన్ ఆసుపత్రితో పాటు సర్ రోనాల్డ్‌రోస్ సెంటర్‌లో కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీకి చెందిన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లలో కూడా ఈ వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.