హైదరాబాద్

వెల్‌నెస్ సెంటర్‌లో తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శనివారం ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్ సెంటర్‌లో విజులెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఉపయోగించే మెడికల్ కిట్లు వృదా, మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు రోగులు, వారి బంధువుల నుంచి ఆరోపణల వెల్లువెత్తాయి. అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా లక్షలు విలువ చేసే వ్యాధి నిర్థారణ కిట్లు వృథా అయినట్టు వార్త పత్రికల్లో కథనాలు సైతం ప్రచురితం అయ్యాయి. దీంతో ఈ విషయంపై దృష్టి సారించిన విజులెన్స్ శాఖ చాలా కాలంగా అంతర్గత విచారణ జరుపుతుంది. ఇందులో భాగంగానే ముగ్గురు అధికారులతో కూడిన బృందం శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫార్మసీలో తనిఖీ చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.