హైదరాబాద్

పోలీసులు అనుమతిస్తే మజ్లిస్ మానవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)కు వ్యతిరేకంగా మజ్లిస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పాతబస్తీ ఖిల్వత్ ప్లేగ్రౌండ్‌లో కవి సమ్మేళనం, సమవేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించడానికి షరతులతో కూడిన అనుమతి లభించడంతో రెండు నుంచి ఐదు నిమిషాలలోపు మాట్లాడాల్సిందిగా వక్తలు, కవులతో పాటు మజ్లిస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ జాగ్రత్త పడ్డారు. కవిసమ్మేళనంలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన పలువురి కవుల ప్రసంగాలు, షాహరీలు ఎంతగానో అకట్టుకున్నాయి. మజ్లిస్ సభ సందర్భంగా దక్షిణ మండలం పోలీసులు ఖిల్వత్ ప్లేగ్రౌండ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సభకు విచ్చేసిన ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా పొలీసులు అనుమతిస్తే ఈనెల 30న మనవహారం నిర్వహిస్తామని చెప్పారు. మనవహారం మహ్మద్ నగర్ నుండి బాపూఘాట్ వరకు నిర్వహించతలపెట్టినట్లు అసద్ వెల్లడించారు. అందరూఉహించిన విధంగా అసదుద్దీన్ పెద్దకు మాట్లాడకపోవడంతో సభకు వచ్చిన వారు నిరుత్సాహానికి గురయ్యారు. సభకు వచ్చిన ముస్లింలు జాతీయ జెండాలు చేత పట్టుకొని మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందూస్థాన్ జిందాబాద్ అంటూ హోరెత్తించారు. ఖిల్వత్ ప్లేగ్రౌండ్‌లో జరిగిన సభకు మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్‌లతో పాటు స్థానిక నాయకులు, వివిధ బస్తీలకు చెందిన మహిళలు, యువకులు హాజరయ్యారు.