హైదరాబాద్

సాంకేతిక నిపుణతతో సమస్యలకు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్: ఇంజనీరింగ్ విద్యార్ధులు తమ సాంకేతిక నిపుణతతో ఆవిష్కరించే ప్రయోగాలతో సామాన్యుల సమస్యలూ పరిష్కరించబడేలా ఆవిష్కరణలు రూపొందించాలని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థ సీఈఓ శ్రీకాంత్ సిన్హా సూచించారు. సోమవారం సైదాబాద్ డివిజన్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హాకథాన్-2020 సన్నాహక సమావేశానికి శ్రీకాంత్ సిన్హా ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం గావించారు. మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాలకు చెందిన 245 మంది విద్యార్థులు జాతీయస్థాయిలో నిర్వహించనున్న స్మార్ట్ ఇండియా హాకథాన్-2020లో పాల్గొననున్నారు. అందులో కళాశాల విద్యార్థులు పలు అంశాలలో చేసిన ప్రయోగాలతో నూతన ఆవిష్కరణలు ప్రదర్శించనున్నారు.
శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ సాంకేతిక విద్యార్థులు ఆయా పరిస్థితులకు అనుగుణంగా తమ పరిఙ్ఞనంతో తగినరీతిలో శోధించి ఆయా సమస్యలకు అనువైన పరిష్కారాలు లభించేలా కృషి చేయాలని అన్నారు. సమావేశంలో మాతృశ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ డా.కేపీ శ్రీనివాస రావు, కళాశాల ప్రిన్సిపాల్ డీ.హనుమంత రావు, సీఎస్‌ఈ విభాగం అధిపతి డా.విజయ్‌పాల్ రెడ్డి పాల్గొన్నారు.

అలరించిని ‘్భక్త రామదాసు కీర్తనలు’
కాచిగూడ, జనవరి 27: భక్త రామదాసు (కంచెర్ల గోపన్న) జయంత్యుత్సవాలు తెలుగు రథం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి రామదాసు కుటుంబ వంశీకులు కంచెర్ల వెంకట రమణ, పడాల తారక రామారావు, సంస్థ అధ్యక్షుడు కొంపెల్ల శర్మ పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు.