హైదరాబాద్

చార్మినార్ సాక్షిగా ప్లాస్టిక్ వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పర్యావరణ, మానవ మనుగడ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్ బ్యాగ్‌లపై విధించిన నిషేధం నగరంలో ఆశించిన స్థాయిలో అమలు కావటం లేదు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఏ సరికొత్త విధానాలు చేపట్టినా, దాన్ని న్యూ సిటీకి మాత్రమే పరిమితం చేసి, పాతబస్తీకి మినహాయింపునిస్తున్నారన్న విమర్శ నెలకొంది.
ఫలితంగా పాతబస్తీలో చారిత్రక కట్టడమైన చార్మినార్ సాక్షిగా విచ్చలవిడగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం కొనసాగుతోంది. మదీనా నుంచి మొదలుకుని చార్మినార్ మీదుగా ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట వరకు రోడ్డుకిరువైపులా ఉండే చిన్న చిన్న వ్యాపార సంస్థలు, తోపుడ బండ్లు, హోటళ్లలో నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నా, కనీసం ప్రశ్నించే వారే కరవయ్యారు. చార్మినార్‌కు కూతవేటు దూరంలోని సర్దార్ మహాల్‌లో జోనల్ కమిషనర్ కార్యాలయం, వివిధ సర్కిళ్లకు చెందిన వైద్యారోగ్య, శానిటేషన్ ఇతర విభాగాల ఆఫీసులకు అధికారులు, సిబ్బంది చార్మినార్ మీదుగానే రాకపోకలు సాగిస్తున్నా, కళ్ల ముందు నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నా, కనీసం ప్రశ్నించే సాహసం చేయటం లేదన్నది చర్చనీయాంశంగా మారింది. 50 మైక్రాన్లకు తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్‌ను వినియోగించే వ్యాపారులను గుర్తించి వారి నుంచి భారీగా జరిమానాలను వసూలు చేయాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
కొద్దిరోజులుగా జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ ప్రత్యేకంగా సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్(సీఈసీ)ని ఏర్పాటు చేసి నగరంలో అక్రమంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తించి, అలాగే రోడ్లపై చెత్తా, భవన నిర్మాణ వ్యర్థాలను వేసే వారిని గుర్తించి భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నా, పాతబస్తీలో ఈ విభాగం వేసిన జరిమానాల సంఖ్య అంతంతమాత్రంగానే ఉండటం పాతబస్తీకి మినహాయింపునిచ్చారనేందుకు నిదర్శనం. ఇప్పటి వరకు ఈ విభాగం సుమారు 35వేల జరిమానాలను విధించినా, అందులో వసూలు చేసిన జరిమానాలు కేవలం ఇరవై శాతం కాగా, ఇందులో పాతబస్తీకి చెందిన వ్యాపారులకు విధించిన జరిమానాలు కూడా అంతంతమాత్రమే. న్యూ సిటీలోని చిన్న చిన్న టిఫిన్ సెంటర్లను, ఛాయ్ బండీలను, ఇంటి మరమ్మతుల కోసం ఇంటి ముందు మట్టి, ఇసుక, ఇటుకలు వేసుకున్న పేద వారిని సైతం వదలకుండా జరిమానాలు విధిస్తున్న అధికారులు ఇప్పటి వరకు పాతబస్తీలో ఒక్క షాపునైనా తనిఖీ చేశారా? అంటూ న్యూసిటీ వ్యాపారులు వాపోతున్నారు.