హైదరాబాద్

నుమాయిష్ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కుటీర పరిశ్రమలు మొదలుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన సంస్థల ఉత్పత్తులను మహానగరవాసుల కోసం ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు నగరంలో నిర్వహిస్తున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనకు సందర్శకులు కాస్త ముందుగానే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి పదకొండు గంటలకు ప్రదర్శన ముగించాల్సి ఉండగా, రోజురోజుకి పెరుగుతున్న రద్దీ కారణంగా నిర్వాహకులు పదకొండు తర్వాత లోనికి సందర్శకులను అనుమతించటం నిలిపేసి, లోనికి వెళ్లిన వారందర్నీ బయటకు పంపించేందుకు సుమారు గంట సమయం పడుతోంది. గత సంవత్సరం నుమాయిష్‌లో అగ్నిప్రమాదం సంభవించి భారీ నష్టం ఏర్పడినందున ఈ సారి నిర్వాహకులు అదనపు జాగ్రత్తలు పాటించారు. ఈ సారి స్టాళ్ల సంఖ్యను సుమారు 2200 స్టాళ్లకు తగ్గించి, అడుగడుగున అగ్నిప్రమాద నివారణ చర్యలను ఏర్పాటు చేశారు. సందర్శకుడి కదలికలను పరిశీలించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అజంతా గేటు నుంచి నుమాయిష్ లోనికి, బయటకు వచ్చే సందర్శకుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భోజన,సంగీత ప్రియులకు పండుగే
నుమాయిష్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి తెలంగాణ రుచులతో పాటు అరేబియన్ ఫుడ్ నోరూరిస్తుంది. ఎంట్రెన్స్ నుంచి లోనికి వెళ్లగానే ఎడమవైపు పత్తర్‌కా ఘోష్, చికెన్ తందూరీ, చికెన్ ఫ్రై వంటివి విక్రయించేందుకు భారీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. లైవ్ కిచెన్‌గా అప్పటికపుడే క్షణాల్లో భోజన ప్రియులకు వడ్డిస్తున్నారు. దీంతో పాటు తెలంగాణ రుచుల్లో ముఖ్యమైన తలకాయ కూర, పాయ, పిండి వంటలు, చికెన్ ఫ్రై వంటివి కూడా విక్రయించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లు భోజన ప్రియులతో నిండిపోతున్నాయ. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంట్రెన్స్ నుంచి ముందుకెళ్లగానే కుడి వైపు ఓపెన్ ధియేటర్‌ను ఏర్పాటు చేసి, మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.