హైదరాబాద్

నేలమట్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో అక్రమ నిర్మాణాలను ఇదివరకు మాదిరిగా పాక్షికంగా కాకుండా మొత్తం నేలమట్టం చేయాలని నిర్ణయించినట్లు బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు. అక్రమ నిర్మాణాలు, అనుమతులున్నా, వాటిని ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి ఇప్పటి వరకు కోర్టు ఆదేశాలు జారీ చేసినా, స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినా, తొలుత నోటీసులు జారీ ఆ తర్వాత సదరు అక్రమ నిర్మాణం స్లాబ్, గోడలకు రంధ్రాలు వేసి, వాటిని వినియోగించకుండా చేసే వారు. కానీ ఇపుడు ఏదైనా అక్రమ నిర్మాణం తొలగింపునకు సంబంధించి కోర్టు ఆదేశాలిస్తే దాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తామని, ఇందుకు అవసరమైతే అదనంగా యంత్రాలు, సిబ్బందిని కూడా సమకూర్చుకుంటామని కమిషనర్ వెల్లడించారు. మరికొన్ని సందర్భాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి కొన్ని అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూల్చేసి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అక్రమ నిర్మాణాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు పేరుకుపోవటం, అక్రమంగా నిర్మించుకుని కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని ఏళ్ల తరబడి కేసులు కొనసాగించటం వంటి అంశాలపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ తెలిపారు. వీలైనంత త్వరగా కేసులను పరిష్కరించుకోవాలని సంబంధిత లీగల్ సెల్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను మన నగరంలో అనుసరించేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, పైగా ఆ ప్రక్రియకు ఖర్చు కూడా ఎక్కువవుతోందని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఒక అక్రమ నిర్మాణాన్ని ఉన్నచోటే క్షణాల్లో నేలమట్టం చేసే ఈ ఆధునిక ప్రక్రియ నగరంలో అమలు చేసే పరిస్థితుల్లేవని కమిషనర్ చెబుతున్నారు.