హైదరాబాద్

సేవాలాల్ సేవలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సమాజానికి సంత్ సేవాలాల్ మహరాజ్ చేసిన సేవలు వెలకట్టలేనివని, మరువలేనివి అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్, డీ.విద్యాసాగర్ కొనియాడారు. మంగళవారం బషీర్‌బాగ్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన 281వ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిజాం కాలేజీ ప్రధాన ఉపాధ్యాయుడు లక్ష్మికాంత్ రాథోడ్, వైస్ ప్రిన్సిపల్ అవినాష్ జైశ్వాల్ పాల్గొన్నారు.