హైదరాబాద్

తెలుగు భాషను పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు భాషాను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్‌ఆర్ మూర్తి అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘కవి సమ్మేళనం’ మానస ఆర్ట్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్‌ఆర్ మూర్తి పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషా అభివృద్ధికి కవులు, కళాకారులుతో పాటు సాంస్కృతిక సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రముఖ నృత్య గురువు అర్చన గుత్తి శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జీవీ ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ గుదిబండి వెంకట రెడ్డి సభాధ్యక్షత వహించగా ప్రముఖ విద్యావేత్త డా.పీ.లలిత వాణి, రచయిత బిజ్జ నాగభూషణం, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్ర రావు, రఘుశ్రీ పాల్గొన్నారు.
ప్రపంచానికి భారతీయతను చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద
కాచిగూడ, ఫిబ్రవరి 20: ప్రపంచానికి భారతీయతను చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని న్యూదిల్లీ మాలవీయ నగర్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. శిఖరం ఆర్ట్ థియేటర్స్, ఏవీకే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో న్యూదిల్లీలోని కళా మందిరంలో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి స్వామి వివేకానంద నేషనల్ ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేసినట్లు గురువారం గానసభలో విలేఖరుల సమావేశంలో సంస్థ అధ్యక్షుడు జీ.కృష్ణ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సోమనాథ్ భారతి పాల్గొని అవార్డులను ప్రదానం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో డా.పసుపర్తి విఠల్, ఫెండ్స్ కామెడీ క్లబ్ అధ్యక్షుడు ఎంవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలి
కాచిగూడ, ఫిబ్రవరి 20: తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలని పలువురు వక్తలు అన్నారు. భావనాల్య సంస్థ ఆధ్వర్యంలో 2020 సెకన్‌లో 101 నృత్య ప్రదర్శనలు ప్రదర్శించి లిమ్క బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాధించుకున్నారు. కార్యక్రమానికి సిటీ సివిల్ కోర్టు నాయ్యమూర్తి జస్టిస్ శ్రీనివాస చారి, భార్గవి, సీతా కిరణ్ పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. 20 గంటలు, 20 నిమిషాలు, 20 సెకన్లు నిర్విరామంగా ప్రదర్శనలు ప్రదర్శించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకోవాడం సంతోషదాయకమని అన్నారు.