హైదరాబాద్

ప్రొ కబడ్డీ లీగ్-3 ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ ప్రొ కబడ్డీ లీగ్-3 సీజన్ శనివారం సాయంత్రం యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. లీగ్‌ను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాథికర సంస్థ (సాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కే.జగదీశ్వర్ యాదవ్, తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్ ప్రవీణ్ రెడ్డి, సంజయ్ రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ జగన్‌మోహన్ రావు, సాట్స్ అధికారి రవీందర్ పాల్గొన్నారు. మార్చి 14 వరకు జరుగనున్న ఈ లీగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.
అలరించిన అన్నమయ్య సంకీర్తనలు
గచ్చిబౌలి, ఫిబ్రవరి 22: అన్నమయ్య పురంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనలు అలరించాయి. చైతన్య లహరి సంగీత అకాడమీ గురువు హరినాథ్ శిష్యులు సాయి ఆశ్రీత, ఆనంది ఇరువురు కలసి అలపించిన సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. అణురేణు పరిపూర్ణుమైన, వేడుకుందామ శ్రీవేంకటేశ్వరుని, తందనాన భళ, చక్కని తల్లికి చాంగుభళ, పడికిలి తలంబ్రాలు పెళ్లి కూతురు అంటూ ముగ్దమనోహరంగా అన్నమయ్య కీర్తనలు అలపించి శ్రోతలను విశేషంగా మెప్పించారు. అనంతరం అన్నమాచార్య భావన వాహిని అధ్యక్షురాలు డాక్టర్ శోభారాజు కీర్తనలు అలపించిన చిన్నారులను జాపికలతో సత్కరించారు.