హైదరాబాద్

బల్దియాకు కొత్త చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వం బల్దియాకు కూడా ప్రత్యేక చట్టాన్ని అందుబాటులోకి తేనుంది. కొత్త చట్టం రూపకల్పన కోసం ఇప్పటికే పలు పర్యాయాలు మున్సిపల్ శాఖ మంత్రి కే.తారక రామారావు జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. వచ్చే నెలల్లో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో బల్దియా సరికొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు శనివారం జీహెచ్‌ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. బల్దియా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ సరికొత్త చట్టం ద్వారా పాలక మండలి, అధికార యంత్రాంగం పనితీరులో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరగనుంది. నిబంధనలకు లోబడి పనిచేయని పాలక మండలిలను రద్దు చేసే అవకాశం కూడా ఈ సరికొత్త చట్టంతో కలగనుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సగం హైదరాబాద్ నుంచి, అలాగే హైదరాబాద్ నగరానికి గుండెకాయ అయిన జీహెచ్‌ఎంసీ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు పదునైన చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. వేగంగా పట్టణీకరణ జరగటం, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉండటంతో భవన నిర్మాణ అనుమతుల జారీపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. దీనికి సమాంతరంగా అక్రమ నిర్మాణాలను అదుపు చేసేందుకు కొత్త చట్టంతో నిబంధనలను కఠినతరం చేయాలని సర్కార్ భావిస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అధికారుల జోక్యం అంతంతమాత్రంగానే ఆన్‌లైన్‌లో అనుమతులను మరింత త్వరితగతిన జారీ చేసేందుకు వీలుగా కొత్త చట్టంలో నిబంధనలను పొందుపర్చనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో 75 గజాల్లోపు నిర్మించుకునే ఇంటికి కొత్త చట్టంలో అనుమతిని మినహాయించింది. ఇదే నిబంధనలో కొంత మార్పు చేసి, ప్లాట్ సైజును 80 నుంచి వంద గజాలకు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పాలక మండలిని అవసరమైనపుడు రద్దు చేసేలా కఠినమైన నిబంధనలతో చట్టం అమల్లోకి రానుంది.
గడువుకు ముందే ఎన్నికలు?
జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన ముగియనుంది. వచ్చే నెల జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే బల్దియా సరికొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మున్సిపల్ మంత్రి కే.తారక రామారావు ప్రకటించిన నేపథ్యంలో సభలో ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత నాలుగైదు నెలల్లోనే బల్దియాకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు విశే్లషణలు ఉన్నాయి.