హైదరాబాద్

తగ్గని చలి.. పెరిగిన ఉష్ణోగ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని వాతావరణంలో విచిత్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలి తీవ్రత తగ్గకుండానే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణంగా మార్చి రెండో వారం నుంచి ఎండాకాలం ప్రారంభమయ్యేది. శివరాత్రికి చలి వణికించిన తర్వాత 20 నుంచి ఇరవై రోజుల తర్వాత ఎండలు మండేవి. కానీ ఈసారి శివరాత్రి రోజు రాత్రికి మాత్రమే చలిగాలులు వీయటం, మధ్యాహ్నం పూట ఎండలు దంచికొడుతున్నాయి. పగటికి, రాత్రి ఉష్ణోగ్రతల్లో సుమారు 15 డిగ్రీల నుంచి 16 డిగ్రీల మధ్య వ్యత్యాసం ఏర్పడుతోంది. శనివారం పనె్నండు గంటల సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదవుతున్నా, రాత్రి పది గంటల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల నుంచి 20 డిగ్రీలకు మధ్య పడిపోవటంతో తెల్లవారుఝమున గాలిలో తేమ పెరిగి, చలి ప్రభావం ఎక్కువవుతోంది. ఫలితంగా ఉదయానే్న వాకింగ్, జాగింగ్ కోసం వచ్చే వారు కాస్త ఆలస్యంగా ఎనిమిది గంటల తర్వాతే పార్కులకు వస్తున్నారు. ఇది ఒక రకంగా ఆరోగ్యపరిరక్షణకు మంచిదేనని వైద్యులు అంటున్నారు. శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 36డిగ్రీలుగా నమోదు కాగా, శనివారం గరిష్ట ఉష్ణోగ్రత ఒక డిగ్రీ, కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు పెరిగి 28గా నమోదు కావటం మున్ముందు ఎండల తీవ్రతను ప్రతిబింబిస్తోంది. గత సంవత్సరం ఫిబ్రవరి 21న కూడా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 36, 22 డిగ్రీలుగా నమోదయ్యాయి. గాలిలో తేమ 40 శాతం ఉండి, తూర్పు వైపు నుంచి గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గాలిలో తేమ తెల్లవారుఝము సమయంలో ఏకంగా 70 నుంచి 75 శాతం ఉంటున్నట్లు, ఆదివారం ఉష్ణోగ్రతలు శనివారం కంటే స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.