హైదరాబాద్

తెలుగు సంస్కృతిని ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు సంస్కృతిని ప్రోత్సహించాలని విశ్వసాహితి అధ్యక్షుడు డా.బ్రహ్మణపల్లి జయ రాములు అన్నారు. వైఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘వసంతోత్సవాలు’ కార్యక్రమం ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయరాములు పాల్గొని ప్రసంగించారు. ఔత్సహిక కళాకారులను ప్రొత్సహించడానికి వై ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ విలక్షణమైన కార్యక్రమాలను రూపొందించి వారిని ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. 18 నుంచి 77 వయస్సు మహిళలు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వైఎస్‌ఆర్ మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో భీమన్న సాహితీ నిధి అధ్యక్షురాలు హైమవతి భీమన్న, గాయనీ వై.కామేశ్వరి పాల్గొన్నారు.
ముగిసిన ‘అంతర్జాతీయ’ నృత్యోత్సవాలు
కాచిగూడ, ఫిబ్రవరి 23: భాగ్యనగర్ నాట్యాంజలి ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ నృత్యోత్సవం’ ముగింపు వేడుకలు ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ డీఐజీ కేశవ నాయుడు పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. మూడు రోజుల పాటు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా అంతర్జాతీయ కళాకారులు నృత్యోత్సవంలో పాల్గొని తమ ప్రదర్శనలు ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. భాగ్యనగర్ నాట్యాంజలి ప్రపంచ వ్యాప్తంగా సంస్థను విస్తరించిందని తెలిపారు. కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంస్థ అధ్యక్షురాలు భాస్కర కళా సామ్రాజ్యం పాల్గొన్నారు.

‘క్రెడ్‌ఆర్’ నూతన సంస్థ ప్రారంభం
కాచిగూడ, ఫిబ్రవరి 23: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన సెకండ్ హ్యాండ్ టూవీలర్ సంస్థ ‘క్రెడ్‌ఆర్’ నూతన షోరూమ్‌ను సుజోయి సురేందర్ నారాయణగూడ ఆదివారం ప్రారంభించారు. టూవీలర్ కొనడానికి అమ్మడానికి క్రెడ్‌ఆర్ సులభమైన ప్రక్రియను అందిస్తుందని వివరించారు. వినియోగదారులు తమకు నచ్చిన బైక్ కొనడానికి వీలుగా క్రెడ్‌ఆర్ వెబ్‌సెట్‌లో బైక్‌ల యొక్క జాబితాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రెడ్‌ఆర్ చేసే లావాదేవీలలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక రిలేషన్‌ఫిప్ మేనేజర్‌ను నియమించిన్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన సెకండ్‌హ్యాండ్ టూవీలర్లను సరసమైన ధరలకే అందించి విశ్వసనీయమైన వేదికను సమాజానికి అందించాలన్నదే తమ ప్రయత్నం అని చెప్పారు.