హైదరాబాద్

రౌండ్ ది క్లాక్.. ఎస్‌ఆర్‌డీపీ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు ఆదేశించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ వౌలిక వసతుల అభివృద్ధికి, సులభ రవాణాకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ పనులను ఒకేసారి పూర్తి చేసేందుకు
అదనంగా మెటీరియల్, సిబ్బంది, యంత్రాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం రోజుకి ఐదు నుంచి ఆరు గంటలు మాత్రమే జరుగుతున్న పనులను రౌండ్ ది క్లాక్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆయా ప్రాంతాల్లో ఒకవైపు రహదారిని మూసి, ట్రాఫిక్‌ను డైవర్టు చేసేందుకు పోలీసు అధికారులతో తాము చర్చించనున్నట్లు వెల్లడించారు. ఒక స్పాన్ తర్వాత మరొకటి, ఒకవైపు మొదలు పెట్టి వరుసగా చేస్తూ చివరివైపు ముగించటం వల్ల జాప్యం జరుగుతున్నట్లు ఆయన వివరించారు. అన్ని స్పాన్ల పనులు జరుగుతుండాలని ఆదేశించారు. ఏజెన్సీలతో పనులను ఎలా వేగవంతం చేయాలన్న అంశంపై సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సృజనాత్మకంగా ఆలోచించాలని, నిధులు సమృద్ధిగా ఉన్నాయని మంత్రి వివరించారు.
బిల్లుల చెల్లింపులు, భూసేకరణ, యుటిలిటీ నిర్మాణాలను తొలగించటంలో జాప్యం వహించరాదని సూచించారు. జలమండలి, డిస్కామ్ అధికారులు కూడా ఈ పనులకు తమవంతు సహకారాన్ని అందించాలని, పనులను సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత ఏజెన్సీలదేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మేయర్ రామ్మోహన్, అర్వింద్‌కుమార్, లోకేశ్‌కుమార్, శ్రీ్ధర్ హాజరయ్యారు.