హైదరాబాద్

అలరించిన ‘పద్మినీ’ గేయ విభావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రముఖ సాహితీవేత్త, రచయిత డా.పద్మినీ చిత్తరంజన్ జయంతి సందర్భంగా ‘పద్మినీ గేయ విభావరి’ నవ్య సాహితీ సమితి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ వ్యవస్థాపక సంచాలకుడు కామిశెట్టి శ్రీనివాసులు పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. పద్మినీ గేయ చిత్తరంజన్ సాహిత్య రంగనికి చేసిన సేవలను కొనియాడారు. గాయకులు అమృతవల్లి, డా.ఎం.చిత్తరంజన్, మదన్ మోహన్, విజయ్ కుమార్, వందనా దేవి, వైష్ణవి, శ్రీనిధి, కార్తీక్, మహతి, హిమజ, గాయత్రి, ఆలేఖ్య అలపించిన గీతాలు అలరించాయి. కార్యక్రమంలో యువభారతి అధ్యక్షుడు డా.ఆచార్య ఫణీంద్ర, జీవీ ప్రభాకర్, సంస్థ అధ్యక్షుడు వీ.విజయ కుమార్ పాల్గొన్నారు.