హైదరాబాద్

1న శ్రీబసవేశ్వర విగ్రహావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: సమాజంలోని అంతరాలను రూపుమాపేందుకు 12వ శతాబ్దంలోనే సంస్కరణలకు నాంధి పలికన బసవేశ్వర విగ్రహాన్ని మార్చి 1న ఆవిష్కరిస్తున్నట్టు బసవ సంక్షేమ సమితి అధ్యక్షుడు మల్లికార్జునప్ప తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ యువజన అధ్యక్షుడు ఈశ్వర ప్రసాద్, జాయింట్ సెక్రటరీ సతీష్ కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. కూకట్‌పల్లిలోని జన్మభూమి కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. కరస్థల లింగదర్శనం పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. సమావేశంలో బద్రీనాథ్, ప్రభు, విజయేంద్ర, శివరాజ్ పాటిల్ పాల్గొన్నారు.

6న ప్రపంచ తెలుగు
మహిళా సదస్సు
ఖైరతాబాద్, ఫిబ్రవరి 25: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ, ప్రభుత్వాల సహకారంతో వచ్చేనెల 6న రెండవ ప్రపంచ తెలుగు మహిళా సదస్సును నిర్వహిస్తున్నట్టు ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఐఆర్‌డీఏ) అధ్యక్షుడు వినయ్ కుమార్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బ్రోచర్‌ను ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో అద్బుతంగా రాణిస్తున్న తెలుగు మహిళలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సదస్సుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి వనిత, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు అవుతారని చెప్పారు. సమావేశంలో బౌద్దనగర్ కార్పొరేటర్ ధనంజన గౌడ్, కోమల్ రాణి, కోఆర్డినేటర్ సఫియా బేగం, మాధవి పాల్గొన్నారు.