హైదరాబాద్

బిల్లులివ్వకుంటే.. పనులు ఆపేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరాన్ని విశ్వనగరంగా మార్చటంలో భాగంగా నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చేపట్టిన అన్ని రకాల ప్రాజెక్టుల పనులకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు జారీ చేసిన ఆదేశాలు సైతం బల్దియాలో అమలు కావటం లేదు. నాలుగు నెలలుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవటంతో పెండింగ్ బిల్లులు ప్రస్తుతం రూ. 200 కోట్లకు పేరుకుపోయాయని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హనుమంత్‌సాగర్, ఉపాధ్యక్షులు శ్రావణ్ సాగర్, శ్రీకాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ అబ్బాస్ అలీ వాపోయారు. అసోసియేషన్‌లోని సుమారు 1500 మంది కాంట్రాక్టర్లు అక్టోబర్ నుంచి చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు, డ్రైనేజీ, సీసీ, బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు సంబంధించి తమకు బిల్లులను చెల్లించటంలో ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్(ఫైనాన్స్) మొదలుకుని జోనల్ కమిషనర్లు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంటు ఇంజనీర్లతో పాటు ఔట్‌సోర్సు ఉద్యోగులు సైతం లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. జోనల్ కమిషనర్లు ఏకంగా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని, లేని పక్షంలో తమ బిల్లులు కూడా ప్రిపేర్ చేయటం లేదని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పనుల్లో తమకు మిగిలేదే అంతంతమాత్రం అందులో అధికారులకు తాము లంచాలు ఎక్కడి నుంచి చెల్లించాలని ప్రశ్నించారు. కొందరు కాంట్రాక్టర్లు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేసి మరీ పనులు చేయిస్తున్నారని, వారికి సకాలంలో బిల్లులు అందకపోవటంతో వడ్డీలు, రుణాలు తీసుకుని కొనుగోలు చేసిన యంత్రాలు, వాహనాల ఈఎంఐలను చెల్లించలేకపోతున్నామని వాపోయారు. తమకు కార్పొరేషన్ బకాయి పడ్డ సుమారు రూ. 200 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరేందుకు అదనపు కమిషనర్(ఫైనాన్స్) వద్దకు వెళితే గెటౌట్ అంటూ తమపై విరుచుకుపడ్డారని, తామేం తప్పు చేశామని, తమతో ఎందుకు దురుసుగా ప్రవర్తించారని, తాము కోట్లాది రూపాయలు వెచ్చించి కార్పొరేషన్ పనులు చేస్తున్నామని కాంట్రాక్టర్లు వాపోయారు. మార్చి 5వ తేదీలోపు తమకు పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని లేని పక్షంలో అదే రోజు సాయంత్రం నుంచి అన్ని పనులను నిలిపివేస్తామని, అవసరమైతే సమగ్ర రోడ్డు నిర్వాహణ ప్రాజెక్టు(సీఆర్‌ఎంపీ) పనులను కూడా క్షేత్ర స్థాయిలో అడ్డుకుంటామని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు.