హైదరాబాద్

రిజర్వేషన్లు తొలగించే కుట్రలపై జాతీయ స్థాయిలో ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: అణగారిన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లను తొలగించే కుట్రలపై జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు ఎమ్మాఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్టమాదిగ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ రాములు నాయక్, మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, జేబీ రాజు, జనార్ధన్, మహేశ్వర్ రాజులతో కలిసి మాట్లాడారు. ఇటీవల ఉత్తరాఖాండ్ కేసు విషయంలో అత్యున్నత న్యాయస్థానం రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదంటూ పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. సుప్రీం వెలువరించిన తీర్పు దేశంలోని దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. అతి కీలకమైన న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేకపోవడమే ఇలాంటి తీర్పులకు కారణం అవుతున్నాయని అన్నారు. వీటన్నింటి నేపథ్యంలో దేశంలోని దళిత, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు చైతన్యం కల్పించి జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. మార్చి 1న నగరంలో ఉద్యోగ, కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.