హైదరాబాద్

బడుగు జీవులపై పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: కంటికి కనిపించని సూక్ష్మజీవి బడుగు జీవితాలపై పంజా విసిరుతోంది. ఎక్కడో చెనాలో బయటపడ్డ వైరస్ ఖండాంతరాలను దాటుకొని ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఓ వైపు ప్రాణభయం మరో వైపు బతుకు భయం సగటు నగర జీవిని వెంటాడుతుంది. 30 రోజుల పాటు శ్రమించి పనిచేస్త వచ్చే నెలసరి వేతనం ఇళ్లు గడవడానికి అంతంత మాత్రంగా సరిపోతుంది. అలాంటిది వచ్చేనెల వేతనాలు వస్తాయో రావో తెలియని దుస్థితిలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక దినసరి కూలీల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కరోనా దెబ్బకు వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి. మహానగరంలో నివసిస్తున్న అత్యధిక జనాభా ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, థియేటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్బులు, పబ్‌ల్లో పనిచేస్తుంటారు. కరోన పుణ్యమా అని పర్యాటక కేంద్రాలు సైతం మూసివేయడంతో ఆయా ప్రాంతాల్లో చిరువ్యాపారాలు చేసుకొని జీవనం సాగించే వారు లక్షల్లో ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు కడుపు చేతపట్టుకొని భాగ్యనగరానికి వసల వచ్చిన వారు ఉంటారు. చిన్నపాటి ఇళ్లల్లో నివాసం ఉంటూ జీవన పోరాటం సాగిస్తున్న ఎందోరో బడుగులపై కరోన ప్రభావం కనిపిస్తుంది. వైరస్ సోకుతుందన్న భయం కంటే తమ జీవితాలను ఎలా వెళ్లదీయాలనే భయం తమను తీవ్రంగా వెంటాడుతుందని పేర్కొంటున్నారు. విపత్కర పరిస్థితిలో ప్రభుత్వం ఏ స్థాయిలో ఆదుకుంటుందోనన్న తెలియక వారిలో వారు మధనపడుతున్నారు. ఇంటి అద్దె నుంచి నిత్యవసరాలను సైతం కొనుగోలు చేసుకోలేని దుస్థితి వస్తుందేమోనని చింతిస్తున్నారు.