హైదరాబాద్

ప్లాస్టిక్ రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: మహానగరంలో త్వరలోనే ప్లాస్టిక్ రోడ్లను నిర్మించాలని యోచిస్తున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ ఆధ్వర్యంలో శుక్రవారం ‘ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్’పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం మన పోగుచేస్తున్న చెత్తలో సుమారు 20 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలుంటాయని, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇతర మహానగరాల మాదిరిగా రోడ్లను నిర్మించే అంశంపై త్వరలోనే జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ విభాగంతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో జమ అవుతున్న సుమారు 4వేల మెట్రిక్ టన్నుల్లో దాదాపు రెండు వేల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ వ్యర్థాలు ఉంటాయని, వీటి ద్వారా ఎరువులు తయారు చేయవచ్చునని ఆయన వివరించారు. చెత్తను వీలైనన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తిరిగి వినియోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే నగరంలో తడి, పొడి చెత్తను సేకరించేందుకు ప్రతి ఇంటికి రెండు డస్ట్‌బిన్లను అందజేసినట్లు ఆయన తెలిపారు. అంతేగాక, వీలైనంత త్వరగా చెత్తను తరలించేందుకు వీలుగా ఉచితంగా ఆటో ట్రాలీలను కూడా పంపిణీ చేశామని తెలిపారు. డస్ట్‌బిన్లను పంపిణీ చేసినప్పటికీ వీటిని వేర్వేరుగా సేకరించడానికి గృహిణులకు, ఇళ్లలో పనిచేసే వారికి, నగరవాసులకు అవగాహన కల్పించటంలో సఫలం కాలేకపోయామని వివరించారు. తడి,పొడి చెత్త వేర్వేరుగా సేకరించేందుకు స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాల సహాయ సహకారాలు తీసుకోనున్నట్లు, పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఈ సందర్భంగా నగరాన్ని ఓపెన్ గ్యార్బెజీ పాయింట్లు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని కమిషనర్ వర్క్‌షాప్‌లో వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్సీ, పలు ప్లాస్టిక్ తయారీ కంపెనీల ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అధికారులకు సన్మానం
నగరంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడకుండా కృషి చేస్తున్న పలువురు అధికారులను కమిషనర్ జనార్దన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సత్కరించారు. ఫ్యాప్సీ నిర్వహించిన వర్క్‌షాప్‌లో భాగంగా ఆయన జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, బి.వి.గంగాధర్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు మమత, దశరథ్, విజయకృష్ణలతో పాటు సహాయ వైద్యాధికారులు డా.రవి. పద్మలను సత్కరించారు.