హైదరాబాద్

ముస్లిం స్థితిగతులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ముస్లిం మైనార్టీల సామాజిక, ఆర్థిక విద్యాపరమైన స్థితిగతులను క్షేత్ర స్థాయిలో అధ్యాయనం చేసేందుకు నియమించిన విచారణ కమిషన్ శుక్రవారం రంగారెడ్డి జిల్లా అధికారులతో సమీక్షించింది. ప్రభుత్వ శాఖలు ముస్లింలకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాల గురించి కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జి. సుధీర్ సమీక్షిస్తూ ప్రభుత్వ ప్రయోజనాలతో పాటు ఏ రంగంలో ముస్లింలకు మరింత చేయూత ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వాన్ని సిఫారసు చేయనున్నట్లు చైర్మన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో పర్యటించి ముస్లిం స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ నివేదికలు ఇస్తామన్నారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా మధ్యాహ్నం భోజన పథకం, ఉచిత పాఠ్య పుస్తకాలు, విద్యా వాలంటీర్లు వంటి సదుపాయాలను మదర్సాలకు అందిస్తున్నామని ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ కమిషన్‌కు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో 9 మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాట్లు చేసి ఈ విద్యా సంవత్సరం నుండి వారికి విద్యను అందించనున్నట్లు తెలిపారు. దీనిపై కమిషన్ చైర్మన్ స్పందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మదర్సాలలో మతపరమైన విద్యతో పాటు ఆధునిక విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాయన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ మాట్లాడుతూ జిల్లాలో 131 ఉర్దూ మీడియం పాఠశాలలు ఉన్నాయన్నారు. వాటిలో 90 ప్రైమరీ, 15 అప్పర్ ప్రైమరీ, 20 హై స్కూళ్లలో సుమారు 12 వేల పై చిలుకు ముస్లిం విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో బడిమానిన విద్యార్థుల నిష్పత్తిని కమిషన్ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖల ద్వారా అందిస్తున్న సేవలను గురించి చైర్మన్ జిల్లా వైద్యాధికారి డా. భానుప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. సంస్థాగత ప్రవచనాలు, కుటుంబ నియంత్రణ, ఇమ్యునైజేషన్ అంశాలపై కూడా అడిగి తెలుసుకున్నారు.
మాతా శిశు మరణాల శాతాన్ని పూర్తి వివరాలతో పొందుపర్చాలని సంబంధిత అధికారిని కోరారు. జిల్లాలో 2252 అంగన్‌వాడి కేంద్రాలు పని చేస్తున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ ఇన్‌చార్జీ పిడి నూర్జహాన్ తెలిపారు. గర్భణి, పాలిచ్చే తల్లులతో సుమారు 12వేల మంది ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చే పౌష్ఠికాహారం అందిస్తున్నట్లు ఆమె వివరించారు. అంతేకాకుండా సుమారు 36 వేల మంది ఆరేళ్లలోపు చిన్నారులకు కూడా అంగన్‌వాడీల నుండి ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2.96 లక్షల ఆసరా ఫించన్లు ఇస్తుండగా వాటిలో 28 ఏల పైచిలుకు ఫించన్లు మైనార్టీలకు ఇస్తున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణ సంస్థ, మెస్మా, వ్యవసాయం, పశుసంవర్థక శాఖ, మైనార్టీ సంక్షేమం, ఆహార భద్రత కార్డు, పోలీసు శాఖల నుండి సంబంధిత వివరాలను సేకరించారు. ఈ సమీక్షా సమావేశంలో కమిషన్ సభ్యులు ఎం.ఎ.్భరీ , అమీరుల్లాఖాన్, జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి, సిపిఒ శర్మ, డిపిఒ అరుణ, డ్వామా పిడి హరిత ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.