హైదరాబాద్

ప్రతి నీటి బొట్టును ఒడిసి పడితేనే భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 13: ప్రతి నీటి బొట్టును ఒడిసి పడితేనే భవిష్యత్తు ఉంటుందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు మజీ డైరెక్టర్ సుదర్శన్ అన్నారు. శుక్రవారం పంజాగుట్టలోని హోటల్‌లో సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్ (ఎస్‌ఎహెచ్‌ఇ) విలేఖరుల సమావేశంలో సాహి అధ్యక్షుడు వివేక్, రమేష్‌లోగ్‌నాథ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. నీటివనరులు అపరిమితమైనవి అనే భావన ప్రజల్లో ఉందని, మిగిలిన ఖనిజాల వల్లే వినియోగించే కొద్దీ నీటివనరులు సైతం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ఏళ్ల తరబడి మానవుడు విచక్షణా రహితంగా నీటిని వినియోగించడం వల్ల నీటి సమస్య తలెత్తుతుందని అన్నారు. ఇప్పటికైనా మానవుడు తన ఆలోచనల్లో మార్పు తెచ్చుకొని నీటి వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు నీటిని సంరక్షించుకునేందుకు నడుం బిగించాలని సూచించారు. పెరుగుతున్న నీటిఎద్దడిని దృష్టిలో ఉంచుకొని సాహి సంస్థ అవగాహన కార్యక్రమలను నిర్వహిస్తోందని, చిన్నపాటి ఇళ్లలో నీటిని ఎలా సంరక్షించుకోవాలి, వర్షపు నీటిని నేరుగా బోరువెల్ రీచార్జ్ కోసం ఎలా వినియోగించాలి అనే సాంకేతిక అంశాలను వివరిస్తున్నట్టు తెలిపారు. నీటి సంరక్షించుకోవాలని నిర్ణయించుకున్న వారు తమ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే పూర్తి వివరాలను తెలుసుకోవచ్చునని చెప్పారు.