హైదరాబాద్

విద్యా వ్యవస్థ పటిష్టతకు చర్యలు: కడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను పటిష్టంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిలంలో రంగారెడ్డి జిల్లా విద్యా శాఖపై ఆయన రాష్ట్ర మంత్రి పి.మహేందర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా శాసనసభ్యులు వారివారి నియోజకవర్గాలలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి సంబంధిత అధికారులతో పాఠశాలలో, కళాశాలలో గల సమస్యలను వాటికి కావాల్సిన నిధుల వివరాలకు సంబంధించి సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఈ నెల 31లోగా అన్ని జిల్లాల కలెక్టర్‌లు విద్యాశాఖపై ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. విద్యా శాఖను మెరుగుపరిచేందుకు అందరూ భాగస్వాములు కావాలని అప్పుడే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు. రానున్న 6 నెలలో విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేవాలని దీనికి స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన సహాయ సహకారాలను అందించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా అన్ని జిల్లాల కంటే తగిన వనరులు కలిగి ఉన్నాయని అనేకంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇతర పెద్ద పరిశ్రమలు కూడా ఉన్నాయని వీటి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు, సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర వౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చని అన్నారు. ఈ జిల్లా అక్షరాస్యతలో, పదవ తరగతి ఫలితాల్లో, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఉత్తీర్ణతలో కూడా వెనుకంజలోనే ఉందని దీన్ని అన్ని విధాల మెరుగుపరుచుటకు అందరూ సహకారం అందించినప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. శాసనసభ్యులు ఆయా మండల విద్యాధికారులు ప్రాధాన్యత క్రమంగా సమస్యలు గుర్తించాలని, ఈ జిల్లాలో 240 కోట్లతో అన్ని వౌలిక సదుపాయల కల్పనకు ప్రణాళిక రూపొందించుటకు అంచనా వేయడం జరిగిందని కడియం శ్రీహరి తెలిపారు. జూన్ 30 లోగా జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు తెలిపినట్లయితే ఆయా సబ్జెక్టులకు డిఎస్సీ నియామకాలు జరిగే వరకు విద్యా వాలంటీర్లను నియమించడం జరుగుతుందని అన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని హైస్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఈ విద్యా సంవత్సరం నుండి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు అకాడమిక్ క్యాలెండర్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో సిసి కెమెరాలను, బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో అందరూ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, వివ్హి కంపెనీల సిఇఓలతో సమావేశాలు ఏర్పాటు చేసి పాఠశాలలకు, కళాశాలలకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు సేకరించడంతో పాటు పలు పాఠశాలలకు ఆయా కంపెనీలకు దత్తత ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. ప్రతి నియోజకవర్గం శాసనసభ్యులు తమ నియోజకవర్గం నిధుల నుండి కోటి రూపాయలు విద్యా వ్యవస్థ అభివృద్ధితి కేటాయించాలని, ప్రభుత్వం జిల్లాకు 54 కోట్ల రూపాయలను కేటాయించిందని మిగతా మొత్తాన్ని సేకరించాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునితారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యనందించి నిరుపేదలైన విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చాలని తెలిపారు. విద్యా శాఖ సమీక్షలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు కొండా విశే్వశ్వరరెడ్డి, మల్లారెడ్డిలు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండేటట్లు చూడాలని, పాఠశాలలో, కళాశాలలో కనీస వసతులు కల్పించాలని దీనికి తమ సహకారం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలున్నాయని వాటిని అభివృద్ధి చేయుట, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు మా సహకారం ఉంటుందని శాసనసభ్యులు కాలె యాదయ్య, సంజీవరావు తెలిపారు. ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు బృహత్తర కార్యక్రమం చేపట్టిందని మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, ఇబ్రహీమ్‌పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు నరెందర్‌రెడ్డి, రాంచందర్‌రావు, జనార్థన్‌రెడ్డి, శాసనసభ్యులు రాంమోహన్‌రెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, ప్రకాష్‌గౌడ్, విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.