హైదరాబాద్

సెల్ టవర్ తొలగించాలని అడ్డగుట్టలో మహిళల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మే 18: తమ ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్న మహమ్మారి సెల్ టవర్‌లను వెంటనే తొలగించాలని అడ్డగుట్ట బి-సెక్షన్ మహిళలు ఆత్మహత్యా యత్నం చేశారు. సెల్‌టవర్ ఎక్కి దూకుతామని బుధవారం రోజుంతా హంగమా చేశారు. పోలీసులు, ప్రజాప్రతినిధులు ఎంత నచ్చజెప్పినా దిగిరాకపోవడంతో సాయంత్రానికి సాక్షాత్తు మంత్రి పద్మారావు రంగంలోకి దిగారు. కొంత కాలంగా ఈ ప్రాంతంలో సెల్ టవర్‌ను నిర్మించడాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ ఏదో విధంగా ఈ ప్రాంతంలో సెల్‌టవర్‌ను నిర్మించారు. దీంతో ఆగ్రహించిన ఇద్దరు మహిళలు శోభ, సుధ.. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ బుధవారం ఉదయం 11 గంటలకు సెల్‌టవర్ పైకి ఎక్కారు. దీంతో అప్రమత్తమైన తుకారాంగేట్ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ససేమిరా అనడంతో ఎట్టకేలకు మంత్రి పద్మారావు వచ్చి సృష్టమైన హామీ ఇవ్వడంతో కిందికి దిగివచ్చారు.
ముప్పైకి పెంచితే ముప్పుతిప్పలే!