హైదరాబాద్

అలరించిన అన్నమయ్య సంకీర్తనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, మే 22: తాళ్లపాక అన్నమాచార్యుల 608వ జయంతి సందర్భంగా శ్రీసాయి శ్రుతి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు గీతాలపన కార్యక్రమం ఆదివారం శృంగేరి శకరమఠంలో ఘనంగా నిర్వహించారు. వర్దమాన గాయనీ నందిని శిష్యబృందంచే అలపించిన అన్నమయ్య సంకీర్తనలు అందరిని అలరించాయి. వేసవి సంగీత శిక్షణలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన చిన్నారులు అన్నమయ్య సంకీర్తలను అలపించి విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం అకాడమీ డైరెక్టర్ వసుధామూర్తి మాట్లాడుతూ వేసవి కాలంలో చిన్నారులకు సంగీత శిక్షణ ఇస్తు వారిని సంగీతంలో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తమ సంస్ధ ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కోన్నారు. కీబోర్డు యామని, తబలా అనిరుద్ శర్మ, శివకుమార్ వాయిద్య సహకరం అందించారు.