హైదరాబాద్

ఎస్‌ఆర్‌డిపికి స్థలమివ్వాలని డిఆర్‌డిఎల్ డైరెక్టర్‌కు వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27 : నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించి, ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ కింద చేపట్టనున్న పనులకు వీలైనంత త్వరగా స్థలాలు ఇవ్వాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అదికారులను కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కంచన్‌బాగ్‌లోని డిఆర్‌డిఎల్ డైరెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌డిపి పనులకు ఆటంకాలను తొలగించేందుకు డిఆర్‌డిఎల్ డైరెక్టర్ డటా. కె. జయరామన్‌తో నేరుగా కలిసి చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పనుల వల్ల డిఆర్‌డిఎల్‌తో పాటు పరిసర ప్రాంతాలు, కాలనీలకు చెందిన ప్రజలకు, ప్రభుత్వ రంగం సస్థలకు ట్రాఫిక్ ఇబ్బందులు దూరమవుతాయని వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ ఎస్‌ఆర్‌డిపి పనులకు భూములను అప్పగించే విషయమై కేంద్ర రక్షణ శాఖ నుంచి ఆదేశాలు రావల్సి ఉన్నాయని, ఈ విషయంలో సంప్రదింపులు జరపనున్నట్లు కమిషనర్‌కు డైరెక్టర్ వివరించారు. డిఆర్‌డిఎల్ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిఆర్‌డిఎల్ డైరక్టెర్ జయరామన్ కమిషనర్ జనర్దాన్ రెడ్డిని కోరగా, ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ‘పైగా’ సమాధులను సందర్శించిన కమిషనర్ అద్భుతమైన కట్టడాలుగా పేరుగాంచిన ఈ పైగా వంశస్తుల సమాధులను కమిషనర్ దాదాపు గంట పాటు పరిశీలించారు.