హైదరాబాద్

సినిమాలతో ప్రజల హృదయాలను స్పందింపచేసిన దాసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: ‘తాతామనవడు’ చిత్రం ద్వారా సినీ దర్శకుడిగా పరిచయమై ప్రేమాభిషేకం, ఓసేరాములమ్మ, కంటే కూతురినే కనాలి వంటి సందేశాత్మక చిత్రాలను కలుపుకుని 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావును తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య ఘనంగా సత్కరించారు. చిత్రాలద్వారా ప్రజా హృదయాలను స్పందింపచేసిన దాసరి నారాయణరావు అని రోశయ్య కొనియాడారు. దాసరి సినీ ప్రస్తానం కొనసాగించాలని చెబుతూ ఢిల్లీ అకాడమీని ప్రశంసించారు. దర్శకరత్నగా సినీ లోకానికి సుపరిచితులైన దాసరి మాట్లాడుతూ- పాలకొల్లులో నిరుపేద కుటుంబంలో జన్మించి అరటిపండ్లు అమ్ముకుంటూ ఒక రూపాయి జీతానికి కూలి పనిచేస్తూ చదువు సాగించి డిగ్రీ పూర్తి చేసాక రంగులరాట్నం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి 21 సం.ల వయసులో ‘తాతామనవడు’ చిఅతానికి దర్శకత్వం వహించి ఈనాటికి ప్రజల అభిమానంతో దర్శకరత్నగా నిలబడ్డానని చెప్పారు. సభాధ్యక్షుడు, విశ్రాంత ఐఎఎస్ అధికారి డా. కె.పద్మనాభయ్య మాట్లాడుతూ, దాసరి 50 సం.ల సినీ జీవితాన్ని దాసరి సినీ యుగంగా వర్ణించారు. తొలుత మోహన్‌కందా స్వాగతం పలుకగా, సిరివెనె్నల సీతారామశాస్ర్తీ, గిరిధర్, విశ్వనాథరాజు, నాగేశ్వరరాజులకు పురస్కారాలు ప్రదానం చేసారు. తొలుత అంధ కళాకారుల సినీ విభావరి అద్భుతంగా జరిగింది.