హైదరాబాద్

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 31: రాష్ట్ర ఏర్పాటు కోసం నిస్వార్ధంగా పోరాడిన ఉద్యమకారులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైనందుకు తాము రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తున్నట్టు 1969 ఉద్యమకారుల సమితి స్పష్టం చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి మేచినేని కిషన్‌రావు, ప్రధాన కార్యదర్శి రామరాజు ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన తీవ్ర ఉద్యమం 1969లోనేనని, సుమారు 360 మంది ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది పోలీస్ దెబ్బలకు గురయ్యారని అన్నారు. రాష్ట్రం కోసం అసువులు బాసిన కుటుంబాలు దిక్కులేకుండా పోయాయని, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ముఖం చాటేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. నిస్వార్ధ ఉద్యమకారులను పక్కన పెట్టిన కేసిఆర్ ఉద్యమకారుల మీద కాలుదువ్విన వారిని మంత్రులుగా చేసుకున్నారని విమర్శించారు. వయస్సు మీద పడి కుటుంబ బాధ్యతలు మోయలేక ఇబ్బందులకు గురౌతున్న 1969 ఉద్యమకారులకు న్యాయం జరిగినప్పుడే రాష్ట్ర ఏర్పాటుకు సార్ధకత ఉంటుందన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసేందుకు జనవరి 11న అనుమతి కోరగా ఇప్పటి వరకు తమకు అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన పద్ధతిని మార్చుకొని నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి గుర్తించి వారికి ప్రభుత్వం తరుపున సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపాల కిషన్, జగన్నాథం, వెంకటస్వామి, ఉపేందర్ రెడ్డి, పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.