హైదరాబాద్

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రోడ్డు భద్రత సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, శాఖల మధ్య సమన్వయం ఉండి, ఎప్పటికప్పుడు సమాచారం అందించుకోవడంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని అన్నారు. వచ్చేనెల 4వ తేదీలోపు ఎ-కేటగిరిగా గుర్తించిన రోడ్డు ప్రమాద స్థలాలను సంబంధిత శాఖలు ఉమ్మడిగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఎ-కేటగిరిలో మియాపూర్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, వనస్థలిపురం, ఉప్పల్, హయత్‌నగర్ ప్రాంతాలలో నెలలో 20కి మించి ప్రమాదాలు జరుగుతున్నట్లుగా గుర్తించినట్టు తెలిపారు. బి-కేటగిరి, సి-కేటగిరిలో ఉన్న ప్రాంతాలపై సమీక్షించారు. హెల్మెట్ ధరించే వారి సంఖ్య పెరిగిందని కలెక్టర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో ఎక్కువ సంఖ్యలో ప్రయాణించడం అరికట్టేందుకు జిల్లా ఎస్పీని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు జాతీయ రహదారుల అధికారులతో సమన్వయం పాటించి రోడ్డు భద్రతపై ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలని, రోడ్డు భద్రత నిమిత్తం సెల్‌ఫోన్ డ్రైవింగ్, వేగంగా నడపడం, మద్యం సేవించి నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్, ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్‌రావు, ట్రాఫిక్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ దివ్యచరణ్, అధికారులు పాల్గొన్నారు.