ఐఫా అదరహో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది సినీ పరిశ్రమలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఆది, సోమవారాలలో రెండురోజులపాటు జరిగే ఈ వేడుకకు దక్షిణాది సినీతారలు తరలివచ్చారు.
గచ్చిబౌలి ఔట్‌డోర్ స్డేడియంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల ద్వారా సేకరించిన మొత్తాన్ని ఇటీవల చెన్నైలో వచ్చిన తుపాను బాధితులకు అందజేయనున్నారు. దాదాపు కోటి రూపాయలు విరాళం
సేకరిస్తారని అంచనా.
ఇప్పటివరకూ బాలీవుడ్‌కి మాత్రమే పరిచయమైన ‘ఐఫా’ అవార్డులు ఈ వేడుకతో మొదటిసారి సౌతిండియన్ సినిమాకూ పరిచయమవుతున్నాయి. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ పేరుతో 2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఇండియన్ సినిమా అవార్డులంటే ఉండే క్రేజ్‌ను మరింత పెంచింది. ఇక మొట్టమొదటిసారిగా సౌతిండియన్ సినీ పరిశ్రమలైన తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలన్నింటికీ కలిపి ఐఫా నిర్వహిస్తోన్న ఈ వేడుకకోసం హైదరాబాద్‌ను వేదికగా
చేసుకోవడం విశేషం.
భారత సినీ పరిశ్రమలో 40శాతం సినిమాలు దక్షిణాదికి చెందిన ఈ నాలుగు రాష్ట్రాలనుంచే వస్తున్నాయి. కాగా రెండురోజులపాటు జరిగే ఈ వేడుక గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. సోమవారం రాత్రి ఈ వేడుక ముగుస్తుంది. మొదటి రోజు రెండు దక్షిణాది భాషా చిత్రాలు, రెండవరోజు మరో రెండు భాషా చిత్రాలకు సంబంధించి చర్చలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. నాలుగు సినీ పరిశ్రమలకు చెందిన పలువురు టాప్‌స్టార్స్ ఈ వేడుకకు హాజరవుతున్నారు. ఇక ఈ వేడుకలో రామ్‌చరణ్, అఖిల్, నవదీప్, మమతా మోహన్‌దాస్, అదాశర్మ, శ్రీయ, తాప్సి, తమన్నా, దేవిశ్రీ ప్రసాద్, నాజర్ ఇలా తెలుగు సినీ పరిశ్రమ నుంచి టాప్‌స్టార్స్ స్పెషల్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అల్లు శిరీష్, రెజీనా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
కాగా ఈ ఐపా ఉత్సవం వివరాలను ఆదివారం మధ్యాహ్నం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్యం, క్యాట్‌వాక్‌తో సినీతారలు ఆహూతులను అలరించారు.